breaking news
dharani nagar colony
-
సెల్లార్లోకి నీళ్లు.. కూకట్పల్లిలో విషాదం
సాక్షి, హైదరాబాద్: అర్థరాత్రి నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. కూకట్పల్లిలోని జయనగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో సెల్లార్లోకి వర్షపు నీళ్లు చేరడంతో సెల్లార్లో పార్క్ చేసిన కారు నీట మునిగి.. అందులో నిద్రిస్తున్న వ్యక్తి దుర్మరణం పాలైయాడు. రాత్రి ఆలస్యమవ్వడంతో గోపి అనే వ్యక్తి.. సెల్లార్లో పార్క్ చేసిన కారులోనే నిద్రపోయాడు. సెల్లార్లోకి వర్షపు నీళ్లు భారీగా చేరడంతో కారులోకి నీరుచేరి ఊపిరాడక అతను మరణించాడు. అతని మృతితో కాలనీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ధరణీనగర్ చెరువులో చుట్టుపక్కల కంపెనీల నుంచి వ్యర్థాలు వెలువడడంతో చెరువు నిండి నీళ్లు ఇళ్లలోకి చేరుతున్నాయని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో వ్యర్ధాలు పేరుకుపోవడంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం వచ్చినా నీళ్లు అపార్ట్మెంట్లోకి చేరుతున్నాయని, చెరువులోని వ్యర్థాలు ఇళ్లలోకి కొట్టుకుని వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. -
మేమున్నామని...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు మేమున్నామంటూ పలువురు ముందుకొస్తున్నారు. వరద ప్రాంతాల్లో కొందరు భోజన సహాయం అందించగా మరికొందరు బిస్కెట్లు, పాలు అందజేశారు.