breaking news
Dhaka man
-
ఒళ్లంతా ట్యూమర్లు..40 ఏళ్లుగా నడవడం లేదు..
ఢాకా: గత 40 ఏళ్లుగా నడవడం లేదు.. కూర్చోవలన్నా.. బయటికి వెళ్లాలన్నా ఇతరులపై ఆధారపడాల్సిందే. వింత జబ్బుతో ఒళ్లంతా ట్యూమర్లు.. అతనిని చూస్తేనే చిన్న పిల్లలు దడుసుకుంటున్నారు. అతని కుడి తొడకైన భారీ కణితి నడవలేని స్థితి, కూర్చోలేని పరిస్ధితిని తీసుకొచ్చింది. చావలేక బతకలేక.. కుటుంబానికి భారమైన 53 ఏళ్ల హరూన్ పట్వారీ ధీన గాథ ఇది. బంగ్లాదేశ రాజధాని ఢాకాకు 90 మైళ్ల దూరంలో ఉన్న చంద్పూర్ జిల్లాలోని నారయణ్పూర్ అనే మారుమూల గ్రామం హరూన్ పట్వారీది. ఇతనికి భార్య జైతూన్ నిసా(49) ఇద్దరు పిల్లలు. ఎలాంటి పనిచేయలేని, కనీసం తన పనైన చేసుకోలేని హరూన్ను బతికించడం కోసం ఆ ఇద్దరు పిల్లలు కూలీలయ్యారు. హరూన్కు 9 ఏళ్ల వయసు నుంచే శరీరమంతా ట్యూమర్లు రావడం ప్రారంభమయ్యాయి. నిరక్ష్యరాస్యత, పేదరికం అతని వ్యాధిని మరింత ముదిరేలా చేశాయి. అతని తల్లితండ్రులు చేయించిన వైద్యం బెడిసి కొట్టింది. ఒళ్లంతా చిన్న చిన్నగా ఉన్న ట్యూమర్లలో తొడ కున్న ట్యూమర్ పెరుగుకుంటూ వచ్చి అతన్ని పూర్తిగా నడవకుండా చేసింది. 33 ఏళ్ల నుంచి అతని బాధను చూస్తున్నానని, అతను ఇలా జీవించడం చూస్తే గుండె తరుక్కుపోతుందని హరూన్ భార్య జైతూన్ నిసా ఆవేదన వ్యక్తం చేసింది. నాకు ఇలా బ్రతకడం నరకంలా ఉందని, బయటికి వెళ్తే చిన్నారులు భయపడుతున్నారని, దీంతో నేను ఎక్కడికి వెళ్లలేక పోతున్నానని హరూన్ తన సమస్యను తెలియజేశాడు. కానీ కొంత మంది యువకులు సాయం చేశారని, కొన్నేళ్లుగా ఆహారం, డబ్బులు ఇస్తూ అండగా నిలిచారన్నాడు. ఇప్పుడు నా స్వశక్తి మీద బతుకాలనుకుంటున్నానని, నాకేదైన సాయం చేయాలని హరూన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. అండగా నిలిచిన సోషల్ మీడియా .. హరూన్ ధీనగాథ తెలుసుకున్న మమూన్ అనే సామాజిక కార్యకర్త, సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరించారు. అతని ధీన గాథను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసి అండగా నిలిచారు. అతను వైద్య చికిత్స మాత్రమే అడగడం లేదని, మళ్లీ తిరిగి పనిచేయాలని కోరుకుంటున్నాడని మమూన్ పేర్కొన్నారు. ప్రజల నుంచి సానూకూలత వ్యక్తం అవుతోంది. త్వరలోనే అతను మూములు మనిషి అవుతాడని మమూన్ తెలపారు. -
ముంబైకర్ల మానవత్వం
ముంబై: మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపించారు నలుగురు ముంబై వాసులు. రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుల్లో ఉన్న బంగ్లాదేశ్ యువకుడికి రక్తం ఇచ్చి ప్రాణదానం చేశారు. ఢాకాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల మహ్మద్ కమ్రుజమాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించగా, ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. అతడిది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూపు అని తెలియడంతో దాతల కోసం ప్రయత్నించారు. బ్లడ్ బ్యాంకుల్లోనూ ఈ గ్రూపు రక్తం దొరక్కపోవడంతో కమ్రుజమాన్ ప్రాణాలపై అతడి కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అయితే ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారు 400 మంది కంటే తక్కువ మంది ఉన్నారని, రక్తదాతలు ముంబైలో దొరుకుతారని థింక్ ఫౌండేషన్ ద్వారా తెలుకున్నారు. కమ్రుజమాన్ సహచరుడు ఎస్ కే తుహినుర్ అలాం ముంబై చేరుకుని రక్తదాతలను సంప్రదించాడు. స్వప్న సావంత్, కృష్ణానంద్ కోరి, మెహుల్ భెలెకర్, ప్రవీణ్ షిండే రక్తదానం చేశారు. దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఢాకాకు తీసుకెళ్లారు. ఆపరేషన్ తర్వాత కమ్రుజమాన్ కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారని రక్తదాతలు తెలిపారు.