breaking news
Dhagad Samba Movie
-
ధగడ్ సాంబలో స్పూఫ్‌లు ఉండవు: సంపూర్ణేశ్ బాబు
‘‘ఇప్పటివరకు నేనెక్కువగా కామెడీ రోల్స్ చేశాను. ‘ధగడ్ సాంబ’లో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ‘కొబ్బరి మట్ట, సింగం 123’ వంటి సినిమాల్లో ఎక్కువగా స్పూఫ్‌లు ఉన్నాయి. కానీ ‘ధగడ్ సాంబ’లో స్పూఫ్‌లు ఉండవు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఎన్.ఆర్.రెడ్డి దర్శకత్వంలో సంపూర్ణేష్, సోనాక్షి జంటగా నటించిన చిత్రం ‘ధగడ్ సాంబ’. బి.ఎస్. రాజు సమర్పణలో ఆర్ఆర్ బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. సంపూర్ణేష్ మాట్లాడుతూ– ‘‘చిన్న సమస్య వల్ల హీరో చిన్నతనంలో తన ఆస్తి కోల్పోతాడు.. మళ్లీ అది సంపాదించుకునే క్రమంలో జరిగే సినిమా ‘ధగడ్ సాంబ’. ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు 12 సినిమాల్లో హీరోగా చేశాను. వాటిలో ‘ధగడ్ సాంబ’ ఏడవది. మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ‘బ్రిలియంట్ బాబు, సన్నాఫ్ తెనాలి, ‘దాన వీర శూర కర్ణ, మిస్టర్ బెగ్గర్’తో పాటు ఒక తమిళ సినిమాలో హీరోగా చేస్తున్నాను’’అన్నారు. చదవండి 👇 బిగ్‌బాస్ ఓటీటీ విజేతగా బిందు, రన్నర్‌గా అఖిల్! హీరోయిన్‌తో ఏడడుగులు నడిచిన ఆది, పెళ్లి ఫొటోలు వైరల్ -
‘ధగడ్ సాంబ’లో కొత్త సంపూని చూస్తారు
‘‘ధగడ్ సాంబ’ చిత్రం సంపూ కెరీర్లో ది బెస్ట్ అవుతుంది. ఇందులో కొత్త సంపూని చూస్తారు. కుటుంబ ప్రేక్ష కులు చూసేలా సినిమా ఉంటుంది’’ అని డైరెక్టర్ ఎన్.ఆర్. రెడ్డి అన్నారు. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా బి.ఎస్. రాజు సమర్పణలో ఆర్ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించిన ’ధగడ్ సాంబ’ ఈ నెల 20న విడుదల కానుంది. ఎన్ఆర్. రెడ్డి మాట్లాడుతూ– ‘‘ధగడ్ సాంబ’కి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, పాటలు నేనే రాసుకున్నాను. ఈ చిత్రకథను నా ఫ్రెండ్, కెమెరామేన్ ముజీర్కి వినిపించాను. సంపూకి కూడా నచ్చడంతో సినిమా చేశాం. ఈ సినిమా ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ముజీర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌లా నిలిచారు’’ అన్నారు.