breaking news
devlopement
-
రాజకీయాలు శాశ్వతం కాదు
ఫొటోస్లగ్07పిఏఎం51 : మాట్లాడుతున్న మండలి బుద్ధప్రసాద్ కూచిపూడి : రాజకీయాలు శాశ్వతం కాదని, అభివృద్ధే ముఖ్యమని డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కూచిపూడిని దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపట్టిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ అభినందనీయులని పేర్కొన్నారు. కూచిపూడిలో సిలికానాంధ్ర ఆధ్వర్యాన నిర్మించనున్న 200 పడకల సంజీవని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఆదివారం బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో ఈర్షా్య ద్వేషాలు తగదన్నారు. కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు విరాళం ఇవ్వొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న డాక్టర్ ప్రపుల్లారెడ్డి, డాక్టర్ పాపారావు, డాక్టర్ అమ్మన్న తమ వంతు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీ కిలారపు మంగమ్మ, గ్రామ సర్పంచ్ కందుల జయరాం, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, మాజీ సర్పంచిలు వైకేడీ ప్రసాదరావు, పెనుమూడి కాశీవిశ్వనాథం, మద్దాలి నాగభూషణం, డాక్టర్ కోటంరాజు స్మృతి, డాక్టర్ చికిర్ష, చింతలపూడి జ్యోతి పాల్గొన్నారు. -
పర్యాటకంగా కొల్లేరు అభివృద్ధి
ఆటపాక(కైకలూరు) : కొల్లేరు సరస్సు, పరివాహక ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని అటవీశాఖ హెడ్ ఆఫ్ డిపార్టుమెంట్ పీసీసీఎఫ్ మిశ్రా అన్నారు. ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరో పీసీసీఎఫ్ (అడ్మినిస్ట్రేటీవ్) ఆర్జీ కలగాటితో కలసి బుధవారం సందర్శించారు. పక్షుల దొడ్డి విస్తీర్ణం, ఈఈసీ కేంద్రాన్ని పరిశీలించారు. మిశ్రా మాట్లాడుతూ టూరిజం పాయింటుగా కొల్లేరును అభివృద్ధి పరుస్తామన్నారు. మరో రెండు నెలల్లో సమావేశమై ప్రణాళికపై చర్చిస్తామని తెలిపారు. అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేష్ కొల్లేరులో నీటి లభ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో ఏకో టూరిజం సీసీఎఫ్ రమణారెడ్డి, రాజమండ్రి సీఎఫ్ ఎం.రవికుమార్, ఏసీఎఫ్ వినోద్‌కుమార్, డీఎఫ్‌వో నాగేశ్వరచౌదరి, రేంజర్ అరుణ్‌కుమార్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.