ధోనీ-సాక్షిల చిట్టి తల్లికి భలే పేరు!
ముంబై: ప్రపంచకప్ టోర్నీలో బిజీగా ఉంటూనే మరోవైపు భారత క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్, ధోని తన ముద్దుల కూతురుకు పేరు పెట్టాడు. గత శుక్రవారం గుర్గావ్లోని ఆస్పత్రిలో జన్మించిన ఈ పాపకు మిస్టర్ కూల్ దంపతులు ‘జివ’ అనే పేరును నిర్ణయించారు. పర్షియన్ భాషకు చెందిన ఈ పదానికి అర్థం ‘అందం’.
మరోవైపు జీవితంలో తొలిసారిగా తండ్రయిన ధోనికి భారత టీమ్ మేనేజిమెంట్ శనివారం రాత్రి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా జట్టు సహచరులకు తన చిన్నారి పేరును వెల్లడించాడు.