breaking news
daredevil jump
-
1,082 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు
-
1,082 అడుగుల ఎత్తు నుంచి దూకేశాడు
లాత్వియా: మరో కొత్త సాహోసేపేత చాలెంజింగ్ క్రీడ మొదలైంది. ప్రపంచంలోనే తొలిసారి ఓ వ్యక్తి డ్రోన్ ద్వారా వెయ్యి అడుగులకంటే ఎత్తులో నుంచి దూకేసి రికార్డు సృష్టించాడు. లాత్వియాలో ఈ రికార్డు ఆవిష్కృతమైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో అడుగుపెట్టిన ఈ వీడియో తెగ హల్చల్ చేస్తోంది. ఎరోన్ అనే 28 ప్రొఫెల్లర్ డ్రోన్‌తో లాత్వియాలోని ఓ డ్రోన్ కంపెనీ ఈ సాహసం నిర్వహించింది. డేర్‌డెవిల్ జంప్ చేసిన స్కై డైవర్ ఇంగస్ ఆగస్ట్కల్న్స్ ఈ వివరాలు తెలియజేస్తూ తనను డ్రోన్ చాలా తేలికగా పైకెత్తిందని, టెక్నాలజీ సహాయంతో డ్రోన్ కంపెనీ తన ఇన్నోవేషన్‌ను రుజువు చేసుకుందని చెప్పాడు. డ్రోన్‌పై నుంచి ప్యారా చూట్ తెరుచుకునే వరకు కూడా తాను కిందపడిపోతున్నప్పుడు చాలా స్వేచ్ఛగా అనింపించిందంటూ జంపింగ్ అనంతరం తన అనుభవాన్ని వివరించాడు. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరిన్ని డ్రోన్లు తయారు చేసి అగ్ని ప్రమాదాలు, తదితర కార్యక్రమాలకు వీటిని ఉపయోగించేలా అందుబాటులోకి తెస్తామంటూ సదరు కంపెనీ తెలిపింది. ఈ వీడియోలో చూపించిన ప్రకారం తొలుత ఓ నీటి మడుగు దగ్గరికి డ్రోన్లను తీసుకెళ్లారు. అంతకంటే ముందు ఒక పెద్ద టెలిఫోన్ టవర్‌పై డైవింగ్ చేసే వ్యక్తిని ఉంచారు. అనంతరం రిమోట్ సహాయంతో డ్రోన్‌ను ఆపరేట్ చేసి టవర్‌పైకి తీసుకెళ్లగా అప్పుడు టవర్‌పై ఉన్న డైవర్ ఇంగస్ దానికి వేలాడదీసిన తాడును పట్టుకున్నాడు. ఆ వెంటనే డ్రోన్ అతడిని దాదాపు 1,082 అడుగుల పైకి తీసుకెళ్లగా అక్కడి నుంచి దూకి మధ్యలో ప్యారాచూట్ ఓపెన్ చేసి సురక్షితంగా కిందికి దిగాడు. మే 12న అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2,75,000మంది వీక్షించారు.