మహానటి కోసం హాలీవుడ్ టెక్నీషియన్
అలనాటి అందాల తార సావిత్రి జీవితకథ ఆదారంగా మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తుంది. సమంత, దుల్కర్ సల్మాన్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హాలీవుడ్ కెమెరామెన్ డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన అంశాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్న చిత్రయూనిట్ త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.