breaking news
	
		
	
  Chronic eye problem
- 
      
                   
                                 పొగ తాగే వారికి ఈ సమస్యలు తప్పవు ..!కొంతమంది చాలా సుదీర్ఘకాలం నుంచి పొగతాగుతూ ఉంటారు. ఇలాంటివారిని ‘క్రానిక్ స్మోకర్స్’ అని వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వాళ్లలో కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు కనిపిస్తుంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఎందుకు, ఎలా వస్తాయో చూద్దాం. కార్నియా పైపొరను ఎపిథీలియమ్ అంటారు. స్మోకింగ్ కోసం తరచూ లైటర్ లేదా అగ్గిపుల్ల ఉపయోగించి, ఆ మంటను నోటి దగ్గరికి తీసుకెళ్లినప్పుడల్లా అది కంటికీ ఎంతో కొంత తాకే అవకాశం ఉంది. అలా మాటిమాటికీ ఆ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్ స్మోకర్స్)లో నికోటిన్ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య కూడా వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్ ఇమేజ్) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్లాగానో, నెగెటివ్ లాగానో (ఘోస్ట్ ఇమేజ్) కనిపిస్తుంది. మీరు వెంటనే సిగరెట్ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్ పూర్తిగా మానేయాలి. ఆ తరవాత వాళ్లకు విటమిన్ సప్లిమెంట్స్ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి నార్మల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇలా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మన చూపును పోగొట్టి దృష్టిదోషాలు తెచ్చే పొగతాగే అలవాటును తక్షణం మానేయడం చాలా మంచిది. చదవండి: తెమడ రంగును బట్టి జబ్బును ఊహించవచ్చు!
- 
      
                   
                                 కనుపాపకు ఎంత కష్టం
 రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే కాలుష్యం వల్ల దీర్ఘకాలిక కంటి సమస్య బారినపడ్డ బాధితుల సంఖ్య ఏటా 15 వేలు. ఇందులో అబ్బాయిలే 70 శాతం
 
 నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత వేగంగా అంటే మనకు ఏం జరుగుతోందో తెలిసే లోపే చూపు మసకబారుతోంది. ఇంటికెళితే చికాకు. ఆఫీసుకొస్తే అలసట. మానసిక ఒత్తిడి. ప్రయాణంతో కంటిపాపపై ఒత్తిడి. ఇదీ నగరంలో లక్షలాది మంది యువత పరిస్థితి. కంటి బాధితులు మిగతా ఏ రంగంలో పెరగనంతగా పెరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని తిన్నగా అంధత్వం దిశగా నెడుతోంది. ముప్ఫై దాటాయో లేదో కళ్లకు అద్దాలు. నలభై దాటితే చత్వారం. యాభైలో మరింత దారుణం. ప్రతి వందమంది కంటి బాధితుల్లో నగరంలో పొగలు, దుమ్మూ ధూళితో వస్తున్న కంటివ్యాధుల బాధితులు కనీసం 15 శాతం దాటారు. పొగల సెగలు కంటిపాపను ఛిద్రం చేస్తున్న తీరుపై డాక్టర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా కంటిని కాపాడుకోవచ్చునని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.రవికుమార్‌రెడ్డి చెబుతున్నారు.
 
 ఇలా మొదలవుతున్నాయ్ కంటిపాప కష్టాలు
 నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు కంటి వ్యాధులకు గురవుతున్నారు.
 {పధానంగా రెండు రకాల ఇబ్బందులు కంటివ్యాధులకు కారణమవుతోంది
 వెజిటబుల్ మెటీరియల్...అంటే వృక్ష సంబంధిత లేదా జంతు సంబంధిత రేణువులు.
 వాహనాల నుంచి వచ్చే రసాయన ధూళి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ తదితరములు
 ఈ రెండు రకాల కారణాల వల్ల ప్రతి 100 మందికీ 15 మంది ఏడాదికి రెండు మూడు సార్లు కంటి వైద్యుల దగ్గరకు వెళుతున్నారు
 ప్రధానంగా వీటి వల్ల కళ్లకలక, ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్ తదితరములు వస్తున్నాయి
 కళ్లు ఎరుపుగా మారి, నీళ్లు కారడం మొదలవుతోంది
 కళ్లలో ఇరిటేషన్, అలర్జీ, పొడిబారడం జరుగుతోంది. కొన్నేళ్ల తరువాత మసకబారుతాయి
 క్రమంగా కంటిచూపు తగ్గుతూ వస్తుంది. ఎయిర్, కెమికల్ పొల్యూషన్ వల్ల కంటిలో నల్లగుడ్డుపై ఎరిటియం అనే కండరంపెరుగుతుంది. ఇది తిన్నగా చూపును తగ్గిస్తుంది
 
 కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే...
 - ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవాలి
 - అద్దంతో కూడిన హెల్మెట్ కవర్‌ను ధరించడం మంచిదే
 - ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లగానే మంచినీళ్లతో కళ్లను కడుక్కోవడం మంచిది
 - అలాగే ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి
 - ప్రయాణం చేసి కొద్దిగా కంటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు
 - పదే పదే కళ్లతో బాధపడుతూంటే వైద్యుల సలహా మేరకు యాంటీబయోటిక్ చుక్కలు వేసుకోవచ్చు.
 - ద్విచక్రవాహనంపై తిరిగే వారు ప్రతి ఆరుమాసాలకు కంటి వైద్యులను సంప్రదించడం మంచిది
 - ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలను కళ్లద్దాలు, హెల్మెట్లు లేకుండా ముందువైపు కూర్చోపెట్టద్దు.
 - ఎక్కువగా పెద్ద చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కళ్లకు ఎఫెక్ట్ అయ్యే పొగలు వెలువడుతాయి. వీలైనంత వరకూ ఇలాంటి చౌరస్తాల గుండా వెళ్లడం తగ్గించాలి
 - డా. రవికుమార్‌రెడ్డి
 కంటివైద్య నిపుణులు,
 మెడివిజన్ హాస్పిటల్
 మెహిదీపట్నం


