breaking news
Chief Arundhati Bhattacharya
-
హోదా ఊహించిందే: ఎస్బీఐ
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుగా (డీ-ఎస్ఐబీ) రిజర్వ్ బ్యాంక్ గుర్తించటం ఊహించిందేనని ఆ బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. అయితే తాజా ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం టైర్1 క్యాపిటల్ అవసరానికి సంబంధించి అదనపు మూలధనం 20 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉందని ఆమె అన్నారు. బ్యాంకుకు ప్రస్తుతం 9.62 శాతం టైర్1 మూలధనం ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అవసరమైన మూలధనం 7 శాతం కన్నా ఇది అధికం. ఎస్బీఐ సహా ఐసీఐసీఐ బ్యాంక్‌కు (డీ-ఎస్ఐబీ) ఈ హోదా కల్పిస్తున్నట్లు ఆర్బీఐ సోమవారం పేర్కొంది. ఇవి భారీ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తున్నందున... ఒకవేళ వీటి సర్వీసులకు విఘాతం కలిగినా ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి సమస్యలు రాకుండా, వీటికి మరింత అత్యున్నత స్థాయి పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. -
ఈ ఏడాది రుణ వృద్ధి జోరు లేనట్లే!
- ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయం - జనవరి నుంచీ పరిస్థితి మారుతుందని అంచనా - మదుపరులు బ్యాంకింగ్యేతర పెట్టుబడి మార్గాలనూ చూడాలి... ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణ వృద్ధి ఊపందుకోకపోవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అయితే మార్చి క్వార్టర్లో అంటే 2016 జనవరి నుంచీ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని ఆమె అంచనావేశారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ ద్వారా ఈక్విటీల్లో ఈపీఎఫ్ఓ పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అరుంధతీ భట్టాచార్య... ఈ సందర్భంగా విలేకరులతో రుణ వృద్ధి తీరుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... - బ్యాంక్ డిపాజిట్లు కాకుండా ఇతర ఇన్వెస్ట్మెంట్ విధానాలపై కూడా మదుపరులు దృష్టి పెట్టాలి. బ్యాంకులే కాకుండా... ఇతర ఇన్వెస్ట్మెంట్ విధానాలు కూడా సురక్షితమేనన్న విషయాన్ని మదుపరులు గుర్తించాలి. - తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని గరిష్టస్థాయిలో భావించడం జరుగుతుంది. అయితే కేపిటల్ మార్కెట్‌ను ఏ విధంగా విశ్వసనీయతలోకి తీసుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ వేగవంతమైన నిర్ణయాలు అవసరం. అయితే ఇలా మదుపరి చేయలేకపోతే- మ్యూచువల్ పండ్స్లు పెట్టుబడులు పెట్టవచ్చు. - రానున్న కాలంలో అటు డిపాజిట్ రేట్లు, ఇటు రుణ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. - మొండిబకాయిలకు సంబంధించి ఒత్తిడి కొంతమేర సడలింది. జూన్ రుణ వృద్ధి తీరు ఇదీ... ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... జూన్‌లో ఆహారేతర రుణ వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది. 2015 ఇదే నెలలో ఈ రేటు 13 శాతం. ఈ ఏడాది మేలో సైతం 9 శాతంగా ఉంది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే... జూన్‌లో రుణ వృద్ధి రేటు 4.1 శాతానికి పరిమితమైంది. 2014 జూన్‌లో ఈ రేటు 10.2 శాతం. పరిశ్రమకు సంబంధించి అన్ని ప్రధాన ఉప విభాగాల్లో రుణాల్లో అసలు వృద్ధిలేకపోగా, క్షీణ పరిస్థితి నెలకొంది. సేవల విభాగానికి వస్తే... జూన్‌లో వార్షికంగా రుణ వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 6 శాతానికి పడిపోయింది.