breaking news
central bank governor
-
Bangladesh Political Crisis: చీఫ్ జస్టిస్‌నూ సాగనంపారు
ఢాకా: బంగ్లాదేశ్‌లో విద్యార్థి సంఘాల హల్ చల్ కొనసాగుతూనే ఉంది. బలవంతపు రాజీనామాల పర్వానికి ఇంకా తెర పడలేదు. షేక్ హసీనా హయాంలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులైన వారంతా తప్పుకోవాల్సిందేనని సంఘాలు అలి్టమేటం జారీ చేశాయి. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ (65), సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ తౌఫ్ తాలుక్దార్ శనివారం రాజీనామా చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరితో కూడిన సీజే అత్యవసరంగా ఫుల్ కోర్టును సమావేశపరుస్తున్నారన్న వార్తలతో ఉదయం నుంచే కలకలం రేగింది. మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి దేశ వ్యతిరేక శక్తులకు దన్నుగా నిలవడమే ఈ భేటీ ఆంతర్యమని విద్యార్థి సంఘాల నేతలతో పాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు కూడా ఆరోపించారు. సీజే, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాజీ ప్రధాని షేక్ హసీనా తాబేదార్లంటూ దుయ్యబట్టారు. దాంతో దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు, నిరసనలు తీవ్రతరమయ్యాయి. సీజే, ఇతర న్యాయమూర్తులు గంటలోపు తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు అలి్టమేటమిచ్చాయి. విద్యార్థులు, యువత సుప్రీంకోర్టును భారీ సంఖ్యలో ముట్టడించారు. దాంతో ఫుల్ కోర్టు భేటీని సీజే రద్దు చేశారు. మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు దేశవ్యాప్తంగా జడ్జిలందరి క్షేమం దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను వెంటనే అధ్యక్షునికి పంపినట్టు న్యాయ సలహాదారు వెల్లడించారు. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేశారు. జస్టిస్ మహ్మద్ అష్ఫకుల్ ఇస్లాంను తాత్కాలిక సీజేగా నియమించారు. తాలుక్దార్ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సర్కారు పేర్కొంది. ఢాకా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మక్సూద్ కమాల్ తదితర ఉన్నతాధికారులెందరో రాజీనామా బాట పట్టారు. యువత, విద్యార్థుల ఆందోళనలతో హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడటం తెలిసిందే. మైనారిటీలపై అవే దాడులు... బంగ్లావ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హసీనా తప్పుకున్న నాటినుంచి గత ఆరు రోజుల్లో కనీసం 205కు పైగా మతపరమైన దాడుల ఉదంతాలు చోటుచేసుకున్నట్టు హిందూ సంఘాలు వెల్లడించాయి. దాంతో మైనారిటీలంతా భయాందోళనల నడుమ గడుపుతున్నట్టు వివరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో మధ్యంతర ప్రభుత్వాధినేత యూనుస్‌కు బహిరంగ లేఖ రాశాయి. తమకు భద్రత కలి్పంచాలని కోరాయి. గత ఐదారు రోజుల్లో దేశవ్యాప్తంగా 230 మంది హింసాకాండకు బలయ్యారు. దాంతో గత జూలై నుంచి చనిపోయిన వారి సంఖ్య 560 దాటింది. తమపై, తమ కుటుంబాలపై దా డులకు నిరసనగా వేలాది మంది హిందువులు శనివారం వరుసగా రెండో రోజు కూడా ఢాకాలో నిరసనలకు దిగారు. ‘హిందువుల ను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.మైనారిటీలను కాపాడుకుందాం: యూనుస్ మైనారిటీలపై జరుగుతున్న దాడులను యూనుస్ తీవ్రంగా ఖండించారు. ‘‘మైనారిటీలు మన దేశ పౌరులు కారా? ఇది చాలా నీచమైన చర్య’’ అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. దేశంలోని హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులకు ఎలాంటి హానీ కలగకుండా కాపాడాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. హసీ నా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ముందుండి నడిపిన పాతికేళ్ల విద్యార్థి అబూ సయీద్‌ను దేశ ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జూలైలో తలెత్తిన ఈ ఆందోళనలకు తొలుత బలైన విద్యార్థుల్లో అబూ కూడా ఉన్నాడు. -
‘ఫెడ్’ప్రభావం తక్కువే..
అక్కడ వడ్డీరేట్లు పెంచినా మనపై అంత ప్రతికూలత ఉండదు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా వడ్డీ రేట్లు పెంచినా మన ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రతికూల ప్రభావం చూపదని ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (క్యాడ్) కొద్దిగా పెరుగుతుందన్నారు. డాలరుతో రూపాయి విలువ ఇప్పటికే బాగా క్షీణించడం వల్ల అమెరికా వడ్డీరేట్ల ప్రభావం వల్ల మరింత తగ్గే అవకాశాలు తక్కువేనన్న అభిపాయ్రాన్ని వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఫౌండర్ డెరైక్టర్ డాక్టర్ వహిదుద్దీన్ ఖాన్ స్మారకోపన్యాస కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ అమెరికా వడ్డీరేట్లు పెంచితే స్వల్పకాలానికి మార్కెట్లు కొద్దిగా కుదుపునకు లోనవుతాయే కానీ, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదన్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ బేస్ రేట్ మార్పుపై స్పందిస్తూ ఇది నిరంతర ప్రక్రియని, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రైసింగ్ ప్రకారం మార్చాలని చూస్తోందన్నారు. అంతకముందు స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవీ కాలమంతా సంక్షోభాలతో నడించిందన్నారు. అమెరికా సబ్ ప్రైమ్, యూరప్ రుణ సంక్షోభం తర్వాత కరెన్సీ క్షీణించడం వంటి వరస సంక్షోభాలను చవి చూడాల్సి వచ్చిందన్నారు. వీటన్నింటిల్లో 2013లో జరిగిన రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం పెను సవాల్‌గా నిలిచిందన్నారు. ఆ సమయంలో కేవలం మూడు నెలల్లో రూపాయి విలువ 17 శాతం క్షీణించిందన్నారు. మిగిలిన సంక్షోభాలను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుక్కోవడానికి తగిన సమయం ఉండేదని, కానీ కరెన్సీ విలువ పతనాన్ని అడ్డుకోవడానికి అప్పటికప్పుడు రియల్ టైమ్‌లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. ఇలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయాలు మార్కెట్‌కు నమ్మకం కలిగించకపోవడంతో రూపాయి మరింత క్షీణించేదన్నారు. ప్రపంచంలో ఏ దేశ రాజకీయ నాయకులైనా, కార్పొరేట్లు అయినా.. వడ్డీరేట్లు తగ్గించడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును పెంచాలని డిమాండ్ చేస్తుంటారే కానీ వడ్డీరేట్లు పెంచడం ద్వారా ధరలను తగ్గించాలని పేదవాడి కోసం ఎవరూ అడగరని దువ్వూరి వ్యాఖ్యానించారు. ఇందుకు ఇండియా కూడా మినహాయింపు కాదన్నారు. కానీ వడ్డీరేట్లు తగ్గింపునకు కొత్త ఇన్వెస్ట్మెంట్లకు సంబంధం లేదన్నారు. ధరల స్థిరీకరణ, వృద్ధిరేటు, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గంటకు పైగా సాగిన ప్రసంగంలో అప్పటి సంక్షోభాలు వాటిని ఎదుర్కొన్న తీరును ఆ సందర్భంలో వచ్చిన విమర్శలను దువ్వూరి వివరించారు.