breaking news
breath enalizer
-
తాగకున్నా.. తాగినట్టే!
నారాయణపేట రూరల్: ఆయన దాదాపు 30 ఏళ్లుగా ఆర్టీసీకి సేవలు అందిస్తూ మరో ఎనిమిది నెలల్లో పదవీ విరమణ పొందనున్న డ్రైవర్.. తన జీవితకాలంలో ఎప్పుడు కూడా మందు తాగలేదు.. స్నేహితులు, తోటి వర్కర్లు సైతం ఈ విషయంలో ఎన్నోసార్లు ఆ యన్ను అభినందించారు.. అయితే అలాంటి వ్యక్తిని జీవంలేని ఎలక్ట్రానిక్ వస్తువును అడ్డం పెట్టుకుని చేయని త ప్పు చేసినట్లు ముద్దాయిగా నిలబెట్టారు. రోజువారి విధులకు పంపకుండా అం దరి మధ్య ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే లా ప్రవర్తించారు.. చివరికి ఎటూ తేల్చకుండా కేస్‌షీట్ చూసి పనిష్మెంట్ డిసై డ్ చేస్తామని తాపీగా చెప్పుకొస్తున్నారు. డిపో ఎదుట ఆందోళన ఆర్టీసీ డిపోలో విధులకు హాజరయ్యే డ్రైవర్లకు ప్రతిరోజు ఉదయం సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి లోపలికి పంపించడం ఆనవాయితీ. ఈ క్ర మంలో గురువారం ఉదయం డ్యూటీకి వచ్చిన డ్రైవర్ ఎస్ఎన్ నాయక్‌కు సైతం పరీక్షించగా అది 54 పాయింట్లు చూయి ంచింది. విషయం తెలిసిన డీఎం భక్షినాయక్ వెంటనే ఆయన డ్యూటీని రద్దు చేసి పక్కకు కూర్చోబెట్టారు. అయితే తన జీవితకాలంలో మందు తాగలేదని చెప్పి నా వినిపించుకోలేదు. తోటి కార్మికులు, కార్మిక సంఘం నాయకులు చెప్పినా పట్టించుకోలేదు. బ్రీత్ ఎనలైజర్ మిషన్ సరిగ్గా పనిచేయడం లేదని, వెంటనే మరొకటి తెచ్చి పరీక్షించాలని కోరినా చేయకపోవడంతో టీఎంయూ ఆద్వర్యం లో డిపో ముందు ధర్నా నిర్వహించారు. డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిషన్ పొరపాట్లతో ఇటీవల ఒక డ్రైవర్‌ను సైతం ఇబ్బంది పెట్టారని, తిరిగి అదే పునరావృతం అయ్యిందని వాపోయారు. దాదాపు గంటపాటు బస్సులు బయటకు రాకపోవడం.. అసలే పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కా ర్యక్రమంలో హన్మంతు, వెంకట్రాము లు, కేవీఆర్ గౌడ్, మైనొద్దీన్, ఆంజనేయులు, మల్లేష్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితిని సమీక్షించిన సీఎస్ఐ బ్రీత్ ఎనలైజర్ సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తూ ఆందోళన చేసిన విషయం జిల్లా అధికారుల దృష్టికి పోవడంతో వెంటనే జిల్లా చీఫ్ సెక్యూరిటీ అధికారి ఆంజనేయులును నారాయణపేటకు పంపించి పరిస్థితిని సమీక్షించారు. మిషన్ పనిచేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం డీఎం, డ్రైవర్ ఎస్ఎన్ నాయక్, యూనియన్ లీడర్లతో వేర్వేరుగా సమావేశమై మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకోకపోయినా మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు, మెడిసిన్ వల్ల పాయింట్లు చూయించే అవకాశం లేకపోలేదని చెప్పారు. ఈ విషయంలో కార్మికుడికి నష్టం జరగకుండా చూస్తామని, ఆయన పీ కేస్ చూసి ఉన్నతాధికారులు పనిష్మెంట్ ఖరారు చేస్తారని వివరించారు. -
బారుల్లో బ్రీత్ ఎనలైజర్లు ఉండాలి
బంజారాహిల్స్: హైదరాబాద్‌ను జీరో డీయూఐ (డ్రైవింగ్ అండర్ ఇన్‌టాక్సికేషన్)గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎకై్సజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని క్లబ్ ట్రినిటీలో మిషన్ స్మార్ట్‌రైడ్ అవగాహన పోస్టర్లను, బ్రీత్ఎనలైజర్లను ఆయన సైబరాబాద్ ఈస్ట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్, మిషన్ స్మార్ట్‌రైడ్ ప్రతినిధి దిలీప్‌జైన్, క్లబ్ ట్రినిటీ నిర్వాహకులు విజయ్‌లతో కలిసి శనివారం రాత్రి ప్రారంభించారు. బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన రమ్య మృతి అనంతరం ఎక్సైజ్, పోలీసు శాఖలు అనేక మార్పులు తీసుకొచ్చాయన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న మద్యం అందించే పబ్బులో అవగాహన కల్పించేందుకు ఈ పోస్టర్లను ఏర్పాటుచేయడంతోపాటు అక్కడ మద్యం సేవించే వారు సురక్షితంగా ఇంటికి వెళ్లడానికి, పరిమితికి మించి మద్యం సేవించకుండా ఉండేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం పబ్‌లోని సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా అన్ని పబ్బుల్లో ఈ విధానాన్ని విస్తరిస్తున్నట్లు వివరించారు. అయితే మద్యం మోతాదు తనిఖీ చేసేందుకు ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్ మిషన్లను పబ్బు నిర్వాహకులే సమకూర్చుకోవాలన్నారు. దిలీప్‌జైన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోనే ప్రభుత్వంతో కలిసి తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం క్లబ్ ట్రినిటీ తొలిగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇక అతిగా మద్యం సేవించిన వారి కోసం ఇప్పటికే ప్రైవేటు క్యాబ్‌లతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. తద్వారా వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామన్నారు. ఇందులో భాగంగా కొన్ని ఉచిత రైడ్లను కూడా అందిస్తున్నామన్నారు.