breaking news
Boyapati Sudharani
-
నా వెనుక ఏ అదృశ్య శక్తి లేదు: బోయపాటి సుధారాణి
-
రాజధానిలో హక్కుల ఉల్లంఘన!
భూ సమీకరణను విమర్శిస్తే ...పోలీసుల వేధింపులే మొన్న శ్రీనాథ చౌదరి... నేడు బోయపాటి సుధారాణి మూకుమ్మడి దాడికి దిగుతున్న పోలీసు యంత్రాంగం, టీడీపీ శ్రేణులు భయం గుప్పిట్లో ‘రాజధాని’ గ్రామాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండు నెలలుగా కంటి మీద కునుకు లేదు... ఎప్పుడు ఏ పోలీసు వస్తాడో తెలియదు.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎప్పుడు వదిలేస్తారో తెలియదు.. ఎప్పుడు ‘ప్రైవేటు’ గూండాలు వచ్చి బెదిరిస్తారో తెలియదు.. నోరు తెరిస్తే తప్పు.. ఏం మాట్లాడాలన్నా భయం.. ఇదేమిటని ప్రశ్నిస్తే వేధింపులు.. తప్పుడు కేసులు.. గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతుల దీనావస్థ ఇది.. భూములు ఇవ్వబోమని చెబితే ఎదురయ్యే పరిస్థితి ఇది.. రాజధాని గ్రామాల్లో హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. రెండు నెలలుగా జరుగుతున్న సంఘటనలతో గ్రామాలు తల్లడిల్లిపోతున్నాయి. రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న తుళ్లూరు, తాడేపల్లి మండలాలకు చెందిన ఆరు గ్రామాల్లోని పంట పొలాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల కేసు విచారణ పేరుతో పోలీసుల వేధింపులు.. భూ సమీకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎదురవుతున్న ‘కష్టాల’తో రైతుల కుటుంబాలు కలవరంలో మునిగిపోతున్నాయి. ఇంతకుముందే తుళ్లూరు మండలం లింగాయపాలేనికి చెందిన శ్రీనాథ్ చౌదరి అనే యువకుడిని పోలీసు విచారణ పేరుతో స్టేషన్లు మార్చుతూ రోజుల తరబడి వేధించగా... తాజాగా తాడేపల్లి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణికి ఇదే పరిస్థితి ఎదురైంది. భూ సమీకరణకు వ్యతిరేకంగా ఆమె చేసిన విమర్శ.. ఆ వెంటనే ప్రారంభమైన పోలీసు విచారణ రాజధాని గ్రామాల్లో చర్చనీయాంశమైంది. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు.. ఆమెకు ఏకంగా ఊరు విడిచి వెళ్లిపోయే దుస్థితి వచ్చింది. కనీసం ఫోన్లో మాట్లాడేందుకూ ఆమె కుటుంబం ధైర్యం చేయడం లేదు. భూ సమీకరణను వ్యతిరేకించే వారికెవరికైనా ఈ దుస్థితి తప్పదనే రీతిలో అధికారుల చర్యలు ఉంటున్నాయి. విమర్శించినందుకే... రాజధాని భూసేకరణను విమర్శిస్తూ బోయపాటి సుధారాణి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దృశ్యాలను... నాలుగు రోజుల కింద వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియాకు చూపించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌లను ఘాటుగా విమర్శించిన వీడియో అది. తర్వాతి రోజు ఈ వార్త దినపత్రికల్లో ప్రచురితం కావడంతోనే సుధారాణి కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకే ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు చెందిన పోలీసులు కృష్ణాయపాలెంలో ప్రత్యక్షమై ఆమె వివరాలు సేకరించారు. సుధారాణి ఇంట్లోలేని సమయంలో ఆమె అత్తమామలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుధారాణి, ఆమె భర్త మంచిలకపూడి శ్రీనివాస్ పేరున ఆ గ్రామంలో వ్యవసాయ భూమి ఏమైనా ఉందా, ఎంత పొలం కౌలుకు చేస్తున్నారు, ఇతర ఆదాయ వనరులు ఏమిటి? తదితర వివరాలు సేకరించి అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు నివేదిక రూపంలో అందించారు. శుక్ర, శనివారాలు పోలీసులు అక్కడే ఉండటంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు సుధారాణిని అభివృద్ధి నిరోధకురాలుగా చిత్రీకరిస్తూ... విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ మూకుమ్మడి దాడిని తట్టుకోలేక సతమతమైన ఆ కుటుంబం గ్రామం విడిచి వెళ్లిపోయింది. సుధారాణి, ఆమె భర్త శ్రీనివాస్ రెండు రోజులుగా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడడానికి భయపడుతున్నారు. ఇలా అక్కడ ఆందోళన నెలకొంది. సుధారాణి కుటుంబ నేపథ్యం సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన సుధారాణి జర్నలిజంలో ఎంఏ చేశారు. తెలుగుదేశం పార్టీకి తాను వీరాభిమానని, టీడీపీ మినహా మరో పార్టీకి ఇంతవరకు ఓటు వేయలేదని ఆమెనే చెప్పుకొన్నారు. ఆ కుటుంబానికి 75 సెంట్ల సొంత భూమి ఉంది. మూడెకరాలను కౌలుకు తీసుకుని సాగుచేస్తూ ఏటా రూ. 2 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఆమె కుటుంబం గ్రామంలో గౌరవంగా జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె సివిల్స్‌కు సన్నద్ధమవుతుండగా, కుమారుడు టెన్త్ చదువుతున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం తనకున్న 75 సెంట్ల భూమిని తీసేసుకుంటే... తామెలా జీవించాలని, పిల్లలను ఎలా చదివించుకోవాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. అన్నదాతలకు ఇన్ని వేధింపులా..? గత ఏడాది డిసెంబర్ 29వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ తెల్లవారుజాము వరకు ల్యాండ్ పూలింగ్‌కు ఎంపిక చేసిన ఆరు గ్రామాల్లోని 13 ప్రాంతాల్లో పంట పొలాలను కొంత మంది దుండగులు దహనం చేశారు. ఇందులో రైతులకు చెందిన వెదురు బొంగు లు, అరటి తోటలు, షెడ్లు, డ్రిప్ పరికరాలను కూడా తగలబెట్టడంతో.. రైతులు నిలువునా తీవ్రంగా నష్టపోయారు. ఇన్నిచోట్ల ఒకేసారి దుండగులు పంట పొలాలకు నిప్పుపెట్టడంతో... ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భూసమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతుల పొలాల్లోనే ఇలా జరగడం పై అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థ లు అధికార పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. కానీ ఈ దహనం ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అడ్డగోలు ఆరోపణలు కూడా చేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు.. అదే రోజున పర్యటనకు వచ్చిన మంత్రిని నిలదీశారు. జగన్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ఇలా మంత్రిని గట్టిగా ప్రశ్నించిన కల్లం సాంబిరెడ్డి అనే రైతును ఆ రోజు సాయంత్రమే పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించా రు. పంటల దహనం కేసు గురించి విచారించేందుకు తెచ్చామంటూ రాత్రంతా స్టేషన్లోనే ఉంచేశారు. అంతటితో ఆగకుండా ఇదే విచారణల పేరిట భూపరిరక్షణ కమిటీ ఏర్పడిన రైతులను, ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన సుమారు 70 మంది రైతులను చాలా రోజుల పాటు తీవ్రంగా వేధించారు. రైతులంతా ఈ వేధింపులను తట్టుకోలేక రెండు సార్లు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుకు నిరసనగా ధర్నాలు కూడా చేశారు. అయినా పోలీసుల వైఖరిలో మార్పు లేకపోవడంతో... హైదరాబాద్‌కు వెళ్ళి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కష్టాలు విన్నవించుకుని, ఆయన ఆధ్వర్యంలో గవర్నర్ నరసింహన్‌ను, మానవ హక్కుల సంఘాన్ని కలిసి రైతులంతా ఫిర్యాదులు చేశారు. ఇదే విధంగా తుళ్ళూరు మండలం లింగాయపాలేనికి చెందిన శ్రీనాథ్ చౌదరి అనే యువకుడిని సైతం పోలీసులు విచారణ పేరుతో స్టేషన్లు మార్చుతూ.. రోజుల తరబడి వేధించారు. చివరకు ఆయనపై కేసు కూడా నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. వాస్తవాలు చెబితే తప్పా! రాజధాని ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం పాల్పడుతున్న ఎన్నో అడ్డగోలు పనులను సుధారాణి నిలదీశారు.ఆమె చెప్పిన అంశాల్లో కొన్ని .. ‘‘సీఆర్డీఏ చట్టాలు తీసుకువచ్చి చంద్రబాబు రైతులను మోసగిస్తున్నారు. నాకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబునాయుడుకు తప్ప ఎవరికీ ఓటు వెయ్యలేదు. అన్నం తినే వాడు ఎవడూ తమ భూములు ఇవ్వడు. చంద్రబాబు గారికి, మంత్రి నారాయణకు, ప్రత్తిపాటి పుల్లారావుకు ఉన్న ఆస్తులను రాజధానికి ఇచ్చేయమనండి. సీఆర్డీఏ కమిషనర్ దగ్గరకు, చంద్రబాబునాయుడు దగ్గరకు నన్ను తీసుకువెళ్తే.. వాళ్లతో నేను మాట్లాడతాను. మీరే (మీడియా) ఎవరైనా నన్ను తీసుకువెళ్లతారా..?’’ ‘‘అసలు ఇక్కడి రైతులు ఏ విధంగానూ భూములు ఇవ్వడానికి ఇష్టపడరు. గ్రామంలో కొంతమందికి భయపడి చిన్న రైతులు భూములు ఇస్తున్నారు. సంవత్సరానికి 35 వేల రూపాయలు ఇస్తానంటున్నారు. దానిలో అత్తమామలకు మందులే కొనలేం. మేం మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాం. మాకు సంవ త్సరానికి లక్షాడెబ్బై వేల రూపాయలు వస్తాయి. సింగపూర్, సింగపూర్ అంటున్నారు చంద్రబాబు. సింగపూర్‌లో అడుక్కునే వారు కూడా ఎక్కువే ఉన్నారు. మా భూములు లాక్కుని మాకు ఒక చిప్ప ఇస్తే రాజధాని ప్రాంతంలో బజారుల వెంట అడుక్కుంటాం. ..’’ -
ఏం తప్పు చేశానని పోలీసులు వచ్చారు?
గుంటూరు: రాజధాని భూసమీకరణపై ప్రశ్నించిన తన ఇంటికి పోలీసులు రావడంపై మహిళా రైతు బోయపాటి సుధారాణి శనివారం గుంటూరులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు ఓ పోలీసు వచ్చి తన మామగారితో మాట్లాడారని చెప్పారు. ''నేను ఏం తప్పు చేశానని పోలీసులు వచ్చారు? నాకు వాక్ స్వాతంత్ర్యం లేదా ? ఇది ప్రజాస్వామ్యం కాదా ? నియంతల ప్రభుత్వంలో ఉన్నామా'' అని ప్రశ్నించారు. అంగ్లంలో ఉన్న సీఆర్డీఏ బిల్లును తెలుగులోకి అనువదించి రాజధాని గ్రామాల్లో ప్రతులు గోడలపైన అతికించమనాలని ప్రభుత్వానికి సూచించారు. వంతెనలు కట్టడానికో, ఆనకట్టలు కట్టడానికో భూములు అడిగితే అందుకు ఏ రైతూ అడ్డు చెప్పరన్నారు. స్థానికంగా పండే పంటలను వేరే చోట పండించి చూపించగలరా అని ప్రభుత్వ పెద్దలకు సుధారాణి సవాల్ విసిరారు. ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని గుర్తు చేశారు. భూములకు పరిహారంగా ఏడాదికి ఇచ్చే రూ. 30 వేలు కరెంటు బిల్లులకు కూడా సరిపోవన్నారు. తన కుమార్తె సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతోందని, కొడుకు పదోతరగతి చదువుతున్నాడని... వాళ్లిద్దరికీ ఉద్యోగాలు ఇవ్వగలరా అంటూ సర్కారును నిలదీశారు. భూములిచ్చేవారిలో చాలా మంది వ్యవసాయం చేసేవాళ్లు కాదన్నారు. వైద్యవృత్తి చేసే డాక్టర్‌ను... ఆ వృత్తి మానుకోండి, నెలకు ఇంత ఇస్తామంటే మానుకుంటారా అని ఆమె అడిగారు. చంద్రబాబు నిజంగా రైతు పక్షపాతి అయితే... సీఆర్డీఏను ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. -
ఏపీ రాజధాని ప్రాంత రైతు ఆవేదన ఇది!!