breaking news
Blue clouds
-
బంగారుతల్లిపై నీలిమేఘాలు
- కొద్ది మందికే అందిన ఆర్థిక సాయం - బాండ్లు పంపిణీ నిలిపివేత పిఠాపురం: బాలికా సంరక్షణకు గత రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన బంగారుతల్లి పథకం అమలుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఏడాదిపాటైనా పూర్తి స్థాయిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఆపథకం పేరుతో ఆడపిల్ల పుడితే వారింట బంగారమే అనుకున్న లబ్ధిదారులకు బాండ్లే బంగారంగా కనిపిస్తున్నాయి తప్ప ఆర్థిక సహాయం మాత్రం అంద లేదు. అధికారులు బాండ్ల పంపిణీని సైతం నిలిపివేయడంతో ఈపథకం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈపథకం కోసం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 19,682 మంది దరఖాస్తు చేసుకోగా 9,722 మందిని అర్హులుగా గుర్తించి ఎంపిక చేశారు. వీరికోసం మొదటి విడత ఆర్థిక సహాయం కింద రూ. 2,43,5000 విడుదల చేశారు. అలాగే జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీల్లో 1,250 మంది దరఖాస్తు చేసుకోగా 456 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరికి కూడా అప్పట్లో బాండ్లను పంపిణీ చేశారు. ఆ బాండ్లపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండడంతో వాటిని నిలిపి వేసిన అధికారులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక పోవడంతో కొత్త బాండ్లు డిజైన్ చేసే వరకు కేవలం ఎన్రోల్ మెంటు మాత్రమే చేస్తున్నారు. బంగారు తల్లి పథకంలో సాయం అందేదిలా... ఈపధకంలో బాగంగా పుట్టిన నాటినుంచి ఆస్పత్రిలో ప్రసవం ఇతర ఖర్చుల కోసం రూ, 2500 ఆతరువాత, టీకాల కోసం రూ, వెయ్యి, అంగన్వాడీ చదువులకు ఏడాదికి రూ, 1500, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఏడాదికి రూ, 2 వేలు ఆర్దిక సహాయం అందించాలి.అలాగే ఆరు నుంచి ఏడో తరగతి వరకు ఏడాదికి రూ, 2500, ఎనిమిదోతరగతి వరకు ఏడాదికి రూ, 2500, తొమ్మిది నుంచి పదోతరగతి వరకు ఏడాదికి రూ, 3వేలు, ఇంటర్మీడియట్‌కు ఏడాదికి రూ, 3500 , గ్రాడ్యుయేషన్‌కు ఏడాదికి రూ, 4వేలు దశల వారీగా అందించడం ఈపథకం లక్ష్యం. అలాగే బాలికకు 18 సంవత్సరాల అనంతరం ఇంటర్మీడియట్ తరువాత రూ. 55 వేలు, గ్రాడ్యుయేషన్ తరువాత రూ. లక్ష కలిపి రూ. 1.55 లక్షలు ఆర్థిక సహాయం అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. సాధారణంగా ఈపధకంలో ఎంపికైన లబ్దిదారుల పిల్లలకు సంరక్షణ కోసం మొదటి విడతగా ఒక్కోక్కరికి రూ, 2500 చొప్పున నిధులు వారివారి బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే బాండ్లు పంపిణీ చేసి నెలలు కావస్తున్నా జిల్లాలో ఇప్పటికి 10,500 మంది ఖాతాలో డబ్బు జమకాకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే పధకం ప్రారంభించి ఏడాది పూర్తవ్వడంతో ప్పటికే తొలి విడత పొమ్ము జమైన వారికి మలి విడతగా టీకాల కోసం ఇవ్వాల్సిన సొమ్ము ఇప్పటి జమకాక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ధూపవిచిత్రాలు!
సృజన ప్రశాంతంగా ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశంకేసి చూస్తుంటే... నీలిమేఘాలు భారంగా కదులుతుంటే, తెల్లని మేఘాలు దూదిపింజల్లా తేలిపోతుంటాయి. ఆ మబ్బుల్లో ఆకారాలను వెతుక్కోవడం భలే సరదా. అంతటి సృజనాత్మకతను ఆస్వాదించడం అలవాటైన మనసు ఊరుకుంటుందా? అగరువత్తి నుంచి వెలువడే ధూపంలోనూ ఆకారాలు వెతుక్కుంటుంది. అలా ఒక రూపం ఇచ్చి ‘స్మోక్ ఆర్ట్’ అని పేరు పెట్టారు రవిబాబు. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపు ఆ బొమ్మలు. స్మోక్ ఆర్ట్ మీద ఆసక్తి కలిగిన సందర్భం! ‘‘దాదాపుగా పదేళ్ల క్రితం ఒకసారి ఇంటర్నెట్లో ఒక ఫొటో చూశాను. ఒక ఫొటోగ్రాఫర్ ధూపాన్ని ఫొటో తీసి దానికి ఫొటోషాప్‌లో ఒక ఇమేజ్‌ని అనుసంధానం చేశాడు. దానిని చూసినప్పుడు నాకు కలిగిన ఆలోచన ఇది. చిత్రకారుడిగా ఎన్నో ప్రయోగాలు చేశాను. దేవుడి ముందున్న సాంబ్రాణి కడ్డీ నుంచి వెలువడే ధూపం గాల్లో కలిసేలోపు ఎన్ని రూపాలు సంతరించుకుంటుందో! మనం ఎన్ని కోణాల్లో చూస్తే అన్ని రూపాలు కనిపిస్తాయి. నేను ఆసక్తిగా చేసుకున్న అ అలవాటుకి అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ స్ఫూర్తితో ఒక రూపం ఇవ్వగలిగాను. మొదట్లో ఒక బొమ్మ వేయడానికి ఒక రోజు పట్టింది. ఇప్పుడు గంట సేపటికి ఒక బొమ్మ సిద్ధమవుతోంది’’ అన్నారు రవిబాబు. బ్రష్ లేదు... పెయింట్ లేదు..! స్మోక్ ఆర్ట్ వేయడానికి రంగులు, కుంచెలు అక్కర్లేదు. ఒక రూపాన్ని ఊహించుకుని దానిని కంప్యూటర్ స్క్రీన్ మీద డ్రాయింగ్ వేస్తారు. ఫొటోషాప్‌లో మరికొన్ని ఎఫెక్ట్లిస్తారు. కంప్యూటర్ మౌస్తో అన్ని ఆకారాలనూ గీయడం కష్టం. అలాంటి వాటిని కాగితం మీద పెన్సిల్‌తో గీసి స్కాన్ చేయాలి. ఆ సాఫ్ట్ కాపీ ఆధారంగా కంప్యూటర్ పెన్సిల్ టూల్‌తో బొమ్మ పూర్తి చేస్తారు. డిజిటల్ పెయింటింగ్‌లో ఇదో ప్రక్రియ. బొమ్మను చూస్తే పొగను ఫొటో తీసినట్లు అనిపిస్తుంది. కానీ ఇది నిజమైన పొగ కాదు, పొగలా కనిపించే ఒక రకమైన చిత్రకళ. ‘‘ఇందులో సృజనాత్మకత ప్రధానం. ఆ దృష్టి ఉంటే మన చుట్టూ కనిపించే ఏ వస్తువునుంచి అయినా కళారూపాన్ని సృష్టించవచ్చు. ఈ రకమైన రూపకల్పన నాతోనే మొదలైందని అనుకుంటున్నాను. నేను చిత్రకారుడిగా శిక్షణ పొందలేదు. ఉత్తమ్ గారి ఏకలవ్య శిష్యుణ్ని. ఆయనను కలిసి బొమ్మవేయడంలో మెలకువలు అడిగినప్పుడు... మెటీరియల్ వాడకం గురించి సలహాలిచ్చారు. ‘బొమ్మ ఎలా వేయాలనేది చిత్రకారుడే నిర్ణయించుకోవాలి. ఎవర్నీ అనుకరించకూడదు, అనాటమీ తప్పకూడదు’... అన్నారు. నేను ఆ మాటలనే అనుసరిస్తున్నాను’’ అంటారు రవిబాబు.