breaking news
BlackBerry Sale
-
అది నన్ను హర్ట్ చేసింది: సమంత
2016 నుంచి ఏకంగా ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన బ్లాక్‌బెర్రీ ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు పని చేయవంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్లాక్ బెర్రీ ఫోన్ పదిహేనేళ్లపాటు కోట్ల మంది యూజర్లను అలరించింది. ఈ మేరకు ఇక తమ ఫోన్ల శకం ముగింసిందని ప్రకటించడంతో చాలా మంది వినయోగదారులు నిరాశకు గురయ్యారు. ఇదే తరహాలో టాలీవుడ్ హిరోయిన్ సమంత కూడా ఈ విధంగా ప్రకటించడం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది. (చదవండి: ‘టైం కి డ్రోన్ రాకపోయుంటే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి’) ఈ బ్లాకెబెర్రీ ఫోన్లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు. పైగా వాటిని "క్రాక్బెర్రీస్" అని పిలిచేవారు. అంతేకాదు కిమ్ కర్దాషియాన్, బరాక్ ఒబామా లాంటి ప్రముఖులు ఈ ఫోన్లనే వాడేవాళ్లు. పెద్ద కీబోర్డు, మధ్యలో ఐబాల్.. కీ సెటప్‌తో ప్రత్యేకంగా ఆకర్షించేవి. అలాంటి ఫోన్లు శకం ముగియడంతో సమంత ఈ బ్లాక్బెర్రీఫోన్లకు చాలా బాధగా వీడ్కోలు పలుకుతున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పైగా ఈ విషయం నన్ను ఎందుకింత బాధించిందో తనకు తెలియదు అని ఇన్‌స్టాలో పేర్కొంది. (చదవండి: షాకింగ్ వీడియో: విధులకు గైర్హాజరు అవ్వడంతో నర్సు పై దాడి) Even though I haven't used it since 2010, I'm sad that my @BlackBerry is now an actual relic of the past. pic.twitter.com/Idvg6OQeuA — Ray Price (@_RayPrice) January 6, 2022 -
అమ్మకం యోచన విరమించుకున్న బ్లాక్‌బెర్రీ
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ విక్రయ ప్రతిపాదన అటకెక్కింది. సంస్థను విక్రయించే యోచనను విరమించి, కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 1.25 బిలియన్ డాలర్ల దాకా నిధులను సమీకరించాలని నిర్ణయించినట్లు కంపెనీ యాజమాన్యం వివరించింది. ఈ ప్రక్రియ రెండు వారాల్లోగా పూర్తి కావొచ్చని తెలిపింది. అలాగే సీఈవో థోర్స్టెన్ హెయిన్జ్ స్థానంలో జాన్ చెన్ని నియమిస్తున్నట్లు పేర్కొంది. వాల్ట్ డిస్నీ కంపెనీ డెరైక్టర్‌గా ఉన్న చెన్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు. అటు మాజీ డెరైక్టర్ ప్రేమ్ వత్స మళ్లీ లీడ్ డెరైక్టర్‌గా వస్తారు. వత్స సారథ్యంలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్‌కి బ్లాక్‌బెర్రీలో 10 శాతం వాటాలు ఉన్నాయి. ఫెయిర్‌ఫ్యాక్స్ తాజాగా 250 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది. యాపిల్ తదితర కంపెనీల నుంచి పోటీతో కుదేలైన బ్లాక్‌బెర్రీని 4.7 బిలియన్ డాలర్లకు కొనేందుకు కూడా ఫెయిర్‌ఫ్యాక్స్ సిద్ధపడిన సంగతి తెలిసిందే.