'బియాండ్ కాఫీ’ ఆవిష్కరణ
మహమ్మద్ ఖదీర్‌బాబు కథాసంపుటి ‘బియాండ్ కాఫీ’ ఆవిష్కరణ నేడు (ఆగస్టు 5, సోమవారం) హైద్రాబాద్ లక్డీకా పూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్లో సాయంత్రం ఆరున్నరకు జరగనుంది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరిస్తారు. నాటక రచయిత డి.విజయభాస్కర్ అధ్యక్షత వహిస్తారు. ఎ.గాంధీ, ముక్తవరం పార్థసారథి, ఆడెపు లక్ష్మిపతి, జి.ఆర్.మహర్షి, అనిల్ అట్లూరి తదితరులు పాల్గొంటారు.