breaking news
Bengaluru streets
-
బెంగళూరు రోడ్లపై చేపలు పట్టారు
-
బెంగళూరు రోడ్లపై చేపలు పట్టారు
బెంగళూరులో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు విరిగిపడటంతో పాటు వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బెంగళూరు నగరంలోని చెరువులు నిండటంతో వరద నీరు రోడ్లపైకి చేరుకుంది. దీంతో రోడ్లు కాలువలను తలపించాయి. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది. ఇక చెరువుల నుంచి వస్తున్న వరదనీటిలో చేపలు రోడ్లపైకి చేరాయి. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో స్థానికులు రోడ్లపై వలలు వేసి చేపలు పట్టుకున్నారు. భారీ వర్షం వల్ల బెంగళూరు వాసులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ జామ్, విద్యుత్ సమస్యలతో ఇక్కట్లు పడ్డారు. బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి.