breaking news
Basbhavan
-
అద్దెకు ‘ఆర్టీసీ’
- 355 బస్‌స్టేషన్ భవనాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయం - మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టులు, ప్లే జోన్ల నిర్మాణానికి అవకాశం - 4 వేల ఎకరాల స్థలాలనూ కేటారుుంచే యోచన - త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన - సినిమా షూటింగులకు బస్‌భవన్ - వాణిజ్య రూపంలో రూ.300 కోట్ల ఆదాయం పొందే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: రండి బాబు రండి.. సినిమా షూటింగులకు బస్‌భవన్‌ను విని యోగించుకోండి.. అన్ని వసతులూ ఉన్నాయ్, మీకు నచ్చిన బస్టాండ్లపైన సినిమా థియేటర్లు ఏర్పాటు చేసుకోండి.. రెస్టారెంట్లు, ప్లేజోన్లైనా ఫర్వాలేదు.. అంటూ ఆర్టీసీ ఆహ్వానిస్తోంది. దీనికి స్పందించి బస్‌భవన్‌లో సినిమా సందడి నెలకొంది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ మొద లు కాగా మరిన్ని సినిమా యూనిట్లు సంప్ర దిస్తు న్నారుు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 355 బస్టాండ్లపై మిని థియేటర్లు, ఇతర వాణి జ్య వ్యవస్థలు ఏర్పాటు చేసేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వెరసి ప్రస్తుతం టికెట్ల ద్వారా కాకుండా వాణిజ్య పరమైన మార్గాల ద్వారా వస్తున్న రూ.70 కోట్ల వార్షికాదాయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 300కోట్లకు చేరాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిబంధనల సడలింపు... తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 4 వేల ఎకరాల ఖాళీ భూములున్నారుు. వీటిని పెట్టుబడిగా చేసి భారీ ఆదాయాన్ని పొందాలని సంస్థ నిర్ణరుుంచింది. వీటిని లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం గతంలో కూడా జరిగినా నిబంధనలు కఠినంగా ఉండటం తో చాలా సంస్థలు వెనకడుగు వేశారుు. ఇప్పుడు ఆ నిబంధనలను సరళతరం చేయటం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించాలని నిర్ణరుుంచారు. ముఖ్యంగా లీజు అద్దె, ఇతర ఫీజులను కనీసం 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని నిర్ణరుుంచారు. వీటితోపాటు ఆర్టీసీ బస్టాండ్ల భవనాలపైన, వెనకవైపు మినీ థియేటర్లుగా మార్చే ఏర్పాట్లు జరుగుతున్నారుు. నగరంలోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్లతో పాటు కోటి, కూకట్పల్లి, కాచిగూడల్లోని ఆర్టీసీ స్టేషన్లలో మల్టీప్లెక్స్ లు, ఇతర పట్టణాల్లోని బస్టాండ్లలో ఉన్న వెసులుబాటు ఆధారంగా మల్టీప్లెక్స్‌లు, మినీ థియేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచింది. థియేట ర్లతో పాటు ఫుడ్కోర్డులు, ప్లే జోన్లులాంటి వాటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా లీజుకు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ఇవ్వనున్నారు. సినిమా షూటింగులకు బస్‌భవన్... ఆర్టీసీ ప్రధాన పరిపాలన భవనం బస్‌భవన్ విశాలంగా ఉండటంతో దాన్ని సినిమా షూటింగులకు అద్దెకివ్వాలని నిర్ణరుుంచారు. ఈ మేరకు సినిమా యూనిట్లతో అధికారులు ఇప్పటికే సంప్రదిస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సంస్థ స్పం దించి వారం రోజులుగా షూటింగ్ నిర్వహి స్తోంది. దీంతో మరిన్ని సినిమా సంస్థలు ముందుకొస్తున్నారుు. అద్దెకు బస్‌భవన్...? బస్‌భవన్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలు అమరావతికి తరలిపోతే చాలా ఖాళీ ఏర్పడనుంది. దీంతో భవనంలోని కొంతభాగాన్ని ప్రైవేటు సంస్థలకు అద్దెకివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్కింగ్ స్థలం విశాలంగా ఉండటంతోపాటు భవనం రాజధాని నడిబొడ్డున ఉండటంతో దానికి మంచి డిమాండ్ ఉంది. ఆ మేరకు పత్రికా ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
‘అద్దె’కు బస్‌భవన్!
సినిమా షూటింగులకు కేటాయిస్తున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: అప్పుల ఊబిలో మునిగిపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు సినిమా షూటింగులను నమ్ముకుంటున్నారనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా లాభా లు రావటం కాదుకదా... కనీసం నష్టాలను తగ్గించలేకపోతుండటంతో ఏదో ఒక రూపంలో నాలుగు రాళ్లు కూడగట్టేందుకు సినిమా షూటింగులే మంచి మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం బస్‌భవన్‌ను సినిమా షూటింగులకు అద్దెకిచ్చారు. బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఓ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ తో బస్‌భవన్ బిజీగా మారిపోయింది. కొద్దిరోజుల కిందటే ఈ సినిమాకు సంబంధించి ప్రధాన ఘట్టాలను వరసగా నాలుగు రోజులపాటు నిరంతరాయంగా బస్‌భవన్‌లో చిత్రీకరించారు. తాజాగా సోమవారం మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. గతంలో పనివేళల్లో షూటింగ్ జరగటంతో ఉద్యోగులు విధులు మానేసి మరీ షూటింగ్ చూసేందుకు ఎగబడ్డారు. దీంతో చెడ్డ పేరు వస్తుందని భావించిన అధికారులు సోమవారం నాటి షూటింగ్ కోసం పని వేళ ముగిశాక అనుమతిచ్చారు. దీంతో సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు షూటింగ్ జరిగింది. అయినా సినిమా యూనిట్ సిబ్బంది మధ్యాహ్నమే బస్‌భవన్‌కు చేరుకుని వంట కార్యక్రమం మొదలుపెట్టారు. షూటింగ్ కోసం రోజుకు రూ.70 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. కార్పొరేట్ కార్యాలయం రూపుతోపాటు ఫ్లోర్లు విశాలంగా ఉండటంతో షూటింగులకు ఆ భవనం అనుకూలంగా ఉందని సినిమా యూనిట్లు భావిస్తున్నాయి. ఎలాంటి సెట్టింగ్‌కు అయినా అనుకూల వాతావరణం ఉండటంతో మరికొన్ని సినిమాలను కూడా అక్కడ షూట్ చేసుకునేందుకు అనుమతులు కోరుతున్నట్టు తెలిసింది. దీంతో రోజువారీ చార్జీని రూ. లక్షకు పెంచాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. అయితే షూటింగుల వల్ల కార్యాలయంలో రోజువారు పనులకు అవాంతరం ఎదురవుతోంద న్న ఫిర్యాదులు వస్తున్నాయి.