సామూహిక అత్యాచారం:8 మంది నిందితులు అరెస్ట్
జార్ఖాండ్‌లో మైనర్ బాలికపై అదివారం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై పలు సేక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారిలో ఉన్నాడని చెప్పారు. అతడిని కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. బన్నోహా గ్రామంలో ఆదివారం గుడి నుంచి ఇంటికి వెళ్తున్న మైనర్ బాలికను అతడి స్నేహితుడు మాయమాటలు చెప్పి పోదల మాటుకు తీసుకువెళ్లాడు.
అప్పటికే అక్కడవేచి ఉన్న మరో ఎనిమిది మంది స్నేహితులు ఆ బాలికపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. అనంతరం సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ బాలిక తీవ్రగాయాలతో ఇంటికి చేరుకుని... జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు వెల్లడించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.