breaking news
Baltal area
-
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి
జమ్మూ: అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 21 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 15 రోజులపాటు జరగనుంది. ఈ విషయాన్ని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు(ఎస్ఏఎస్బీ) ప్రకటించింది. యాత్రకు అంకురార్పణ చేస్తూ ప్రథమ పూజను శుక్రవారం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి అమర్నాథ్ యాత్రను కుదించారు. సాధువులు మినహా 55 ఏళ్లు పైబడిన వారిని యాత్రకు అనుమతించరు. అనంత్‌నాగ్ జిల్లాలో పవిత్ర గుహలో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్లు కలిగి ఉండడం తప్పనిసరి. యాత్ర కోసం వచ్చే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని శ్రీఅమర్నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మంచు శివలింగం దర్శనానికి సాధువులు మినహా మిగతా యాత్రికులంతా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పవిత్ర గుహలో 15 రోజులపాటు ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అధికారులు నిర్ణయించారు. బాల్తాల్ మార్గంలోనే యాత్ర జరుగుతుంది. పహల్గామ్ మార్గంలో ఎవరినీ అనుమతించరు. బెంగళూరులో భక్తుల రాకకోసం ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. శనివారం సిటీలో ఓ ఆలయంలో విగ్రహాలపై రసాయనాలు చల్లి క్రిమిరహితం చేస్తున్న అర్చకులు -
అమరనాథ్ యాత్రలో హింస
శ్రీనగర్: హింస చెలరేగడంతో అమరనాథ్ యాత్ర అర్ధాంతరంగంగా ఆగిపోయింది. సామూహిక వంటశాలలు నిర్వహించే యజమానులకు, గుర్రాలపై భక్తులను తరలించే యజమానుల మధ్య ఘర్షణ తలెత్తడంతో హింస చెలరేగింది. అన్నదానం టెంట్లకు గుర్రపు యజమానులు నిప్పుపెట్టారు. దీంతో గ్యాస్ సిలెండర్లు పేలిపోయాయి. భయంతో భక్తులు పరుగులు తీశారు. ఆగ్నేయ శ్రీనగర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బాల్టాల్ ప్రాంతానికి సమీపంలోని దుమాయిల్ బేస్ క్యాంప్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 25 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించారు. సంఘటనా స్థలానికి వెళ్లాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ లో ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు. పరిస్థితిని అదుపుచేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.