breaking news
Balanarsaiah
-
చింతకాయలు తెంపుతుండగా.. కట్టుకున్న లుంగీ మెడకు చుట్టుకుని.. ఆపై..
సాక్షి, కరీంనగర్: చింతకాయలు తెంపుతూ చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కొని ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది నుంచి వచ్చిన నిమ్మల బాలనర్సు (44) భార్య మాధవి, కూతురు లహరి (14)తో కలిసి సిరిసిల్ల పరిధిలోని జగ్గారావుపల్లెలో ఉంటున్నాడు. భార్యాభర్తలు వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నారు. బుధవారం సిరిసిల్ల మార్కెట్లో నిమ్మకాయలు విక్రయించి ఇంటికి వెళ్లే క్రమంలో బాలనర్సు గ్రామ శివారులోని చింతచెట్టు ఎక్కాడు. చింతకాయలు తెంపి చెట్టు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారి కొమ్మల మధ్య ఇరుకున్నాడు. ఈ క్రమంలో లుంగీ గొంతుకు బిగించుకుపోగా చెట్టుపైనే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. ఇవి కూడా చదవండి: ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి? -
రాజకీయాల్లో ఎందుకుండొద్దు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎందుకు ఉండకూడదనే చర్చ జేఏసీలో మొదలైంది. ఎన్నో త్యాగాలు చేసి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇదే సంప్రదాయ రాజకీయ నాయకత్వం చేతిలో పెడితే ఎలా? అని పలువురు నేతలు ప్రశ్నించారు. జేఏసీ పాత్ర ఇక్కడికే పరిమితం కాకుండా చూడాలని వారు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ శివారులో తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం సమీపబంధువు రతన్‌కు చెందిన ఫాంహౌస్‌లో సోమవారం జరిగిన విందులో ఈ కీలక అంశంపై ఆసక్తికరమైన ఇష్టాగోష్టి చర్చ జరిగింది. తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ నేత బాలనర్సయ్య ఈ విందు ఏర్పాటు చేశారు. జేఏసీ ముఖ్యనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో జేఏసీ పాత్ర రాజకీయంగానూ, సామాజికంగానూ ఉండాలని నేతలు ఆకాంక్షించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ పాత్ర ఉండాల్సిందేన ని చాలామంది అంటున్నరు. నేను ఎక్కడికైనా వెళ్తే సామాజిక, వ్యక్తిగత సమస్యలను చెప్పుకుంటున్నరు. ఒకాయన వర్షాల వల్ల పంట పాడైందని, నష్టపరిహారం ఇప్పించాలని అడిగిండు. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రివో, మంత్రివో అయితవు కానీ నా పరిహారాన్ని మర్చిపోకు అని అన్నడు. ఇవన్నీ వింటూంటే జేఏసీపై ప్రజలకు చాలా నమ్మకమైతే ఉందనిపిస్తోంది’ అని కోదండరాం వ్యాఖ్యానించినట్టు సమాచారం. జేఏసీ పాత్ర ఏ రూపంలో ఉండాలనేదానిపై టీఆర్ఎస్ కదలికలను బట్టి మాట్లాడుకోవాలని సూత్రప్రాయంగా అనుకున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను రహస్యంగా ఎందుకు కలిశారని, దీనివల్ల స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని నిజామాబాద్ జేఏసీ అధ్యక్షుడు గోపాలశర్మ, మరికొందరు కోదండరాంను నిలదీసినట్టు సమాచారం. పరస్పర అవసరాలు ముఖ్యంగా ఉద్యమ అవసరాలే ఇందులో ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు తెలంగాణకు సానుకూల నిర్ణయాలు, పరిణామాలు ఉంటున్న సమయంలో జీవోఎంను కలవాల్సిన అవసరం లేదని భావించారు. నవంబర్‌లో తెలంగాణ బిల్లు సిద్ధమై, డిసెంబర్లో పార్లమెంటులో పెట్టే అవకాశాలున్నాయన్న అంచనాకు వచ్చారు. రాష్ట్ర పర్యటనలోనే ఉన్న రాష్ట్రపతిని కలవాలని, ఇక్కడ వీలుకాకుంటే ఢిల్లీకి వెళ్లి కలవాలని నిర్ణయించుకున్నారు.