breaking news
archiology directior
-
ద్వారకా తీరంలో అన్వేషణ..!
రెండు దశాబ్దాల తరువాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) గుజరాత్‌లోని ద్వారకా తీరంలో నీటి అడుగున అన్వేషణను తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో అయిదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది.తొలిసారిగా ఈ అన్వేషణ బృందంలో మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. ఏఎస్ఐ డైరెక్టర్(తవ్వకాలు, అన్వేషణలు) హెచ్‌కే నాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అపరాజిత శర్మ, పూనమ్ వింద్, రాజ కుమారీ బార్బీనా పరిశోధన బృందంలో సభ్యులుగా ఉన్నారు. దశల వారీగా ఈ బృందం అన్వేషణలు కొనసాగిస్తుంది. మొదటి దశలో భాగంగా పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. తొలిదశలో కనుగొన్న అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ‘ఇదొక అపూర్వమైన అవకాశం’ అంటుంది పూనమ్ వింద్. నిజమే కదా! (చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..) -
రూ.7కోట్లతో పురావస్తుశాఖ పనులు
కొల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా రూ.7కోట్లతో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆ శాఖ డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. మంగళవారం ఆమె మండలపరిధిలోని మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలోని జాకారం, కొండపర్తిలో ఆలయ పునర్నిర్మాణానికి, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ఆధునికీకరణ, ఖైరతాబాద్ మాస్క్, పురానాపూల్ గేట్ నిర్మాణ పనులు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు వివరించారు. సోమశిలలోని పురాతన విగ్రహాలను రీఅలైన్మెంట్ ద్వారా దిమ్మెలపై ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నరేందర్‌రెడ్డి డైరెక్టర్ విశాలాక్షి్మని కలిశారు. మంచాలకట్ట రామ తీర్థాలయ ప్రాశస్త్యాన్ని దేవాదాయ శాఖ, పురావస్తు శాఖలు సరైన రీతిలో ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో రామ తీర్థాలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. ఆమె వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రహీంషాఅలీ, ఏడీలు నాగరాజు, నర్సింగ్‌నాయక్ ఉన్నారు.