breaking news
Anti-Terrorism Squad
-
పాక్‌లో లాడెన్ సన్నిహితుడి అరెస్ట్
లాహోర్: అల్ ఖైదా సీనియర్ నేత, ఒసా మా బిన్ లాడెన్‌కు సన్నిహితుడిగా భావిస్తున్న అమీనుల్ హక్‌ను పాక్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అరెస్ట్ చేసింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు అతడు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోగలిగామని ఉగ్రవాద వ్యతిరేక విభాగం డీఐజీ ఉస్మాన్ అక్రమ్ చెప్పారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాత్ జిల్లా సరాయ్ ఆలంగిర్ పట్టణంలో దాగున్న అతడిని పట్టుకున్నట్లు అక్రమ్ తెలిపారు. ఉగ్రవాదంపై జరుపుతున్న పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. -
ఉగ్రవాదుల కలకలం.. ఇద్దరు అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కకోరిలో దుబ్బగ్గలో లక్నో ఏటీఎస్ అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానిత ఉగ్రవాదులకు అల్‌ఖైదాతో సంబంధాలున్నట్లు గుర్తించారు. వారి నుంచి విదేశీ తుపాకులు సహా.. పేలుడు పదార్థాలు ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రెజర్ కుక్కర్ బాంబులను కూడా ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీరియల్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అయోధ్య, కాశీ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను పెంచారు. సకాలంలో ఉగ్రవాదులు పట్టుబడడంతో ప్రమాదం తప్పిందని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు. -
26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం
‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’. ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ అని! పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్. ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి! 2008 నవంబర్ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిపించి, 174 మంది దుర్మరణానికి, మూడొందల మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన లష్కరే తోయిబా టెర్రరిస్ట్. అతడి చివరి మాటలివి. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. అంతకు నాలుగేళ్ల క్రితమే.. ముంబై పేలుళ్లు జరిగిన మరుసటి రోజు.. మళ్లీ ఇలాంటి ఘోరం జరగనిచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రతిన పూనింది. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా? మారిందని మనకు అనిపించవచ్చు. అయితే టెర్రరిస్టులను సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీస్ అధికారుల కుటుంబాల పరిస్థితి మాత్రం ఏం మారలేదని అంటున్నారు. అసలు పరిస్థితిని మార్చుకోవలసినంతగా ఎందుకు మనం నిర్లక్ష్యం వహించామని అడుగుతున్నారు. ఆ ఐదుగురి గురించి ఒక మననం. ఆ కుటుంబాల గురించి ఒక అవలోకనం. హేమంత్ కర్కరే ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్. దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం! కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్బ్లెస్ హాస్పిటల్‌కి మూవ్ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్బ్లెస్కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్ క్వాలిస్ జీప్ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్లెస్లో ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి Ðð ళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు. హేమంత్ కర్కరే, కవిత కుటుంబం: భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని కవిత ఎప్పుడూ అంటుండేవారు. పోలీస్ సిబ్బందికి అధునాతనమైన ఆయుధాలను ఇవ్వాలని, వాళ్లను ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేసే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. తుకారామ్ ఆంబ్లే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. టెర్రరిస్టులు మెరైన్ డ్రైవ్ వైపు వెళుతున్నారని సమాచారం రావడంతో.. ఆ దారిని బ్లాక్ చేసే డ్యూటీని తుకారామ్‌కి అప్పజెప్పింది డిపార్ట్మెంట్. కారును ఆపాడు. ఒట్టి చేతుల్తో కసబ్‌తో కలియబడి అతడి దగ్గరున్న బుల్లెట్లన్నీ లాగేసుకున్నాడు. తుకారామ్ ఆ పని చేయకపోయుంటే.. కసబ్ తనని తను కాల్చుకుని ఉండేవాడేమో. టెర్రరిస్టులతో జరిగిన ఆ ఘర్షణలోనే తుకారామ్ మరణించాడు. తుకారామ్ ఆంబ్లే, తారాబాయి కుటుంబం: తుకారామ్ ఆంబ్లేకి నలుగురు కూతుళ్లు. పవిత్ర, వందన, వైశాలి, భారతి. కొడుకులు లేరు. భార్య తారాబాయి. ఉగ్రదాడుల్లో తుకారామ్ చనిపోయే నాటికి పవిత్రకు, వందనకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ ఇంట్లో ప్రస్తుతం తారాబాయి, వైశాలి, భారతి ఉంటున్నారు. ‘‘ఇప్పటికీ.. మా నాన్న డ్యూటీ అయిపోయాక, ఇంట్లోకి రాగానే తలపై నుంచి టోపీ తీసి రోజూ పెట్టే చోటే తగిలించి, మా వైపు చూసి నవ్వుతూ ‘ఏంటి విశేషాలు..’ అని అడుగుతున్నట్లే ఉంటుంది. కానీ మాకు తెలుసు మా నాన్న తిరిగి రారని. వస్తే బాగుండని అనిపిస్తుంది’’ అని అంటుంది వైశాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సందీప్ ఆర్మీ ఆఫీసర్. తాజ్ హోటల్లోని ఆరో ఫ్లోర్లో ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్.ఎస్.సి. (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) టీమ్‌ని లీడ్ చేసింది సందీపే. మొత్తం పదిమంది కమాండోలు. వారికి గైడ్‌లైన్స్ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగిన కాల్పుల్లో సందీప్ చనిపోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, అమ్మ ధనలక్ష్మి కుటుంబం: అమ్మ ధనలక్ష్మి, నాన్న ఉన్నికృష్ణన్.. సందీప్, వీళ్ల ముగ్గురే. సందీప్ ఒకడే సంతానం. పెళ్లి కావలసి ఉంది. ఉగ్రవాదులతో తలపడుతున్నప్పుడు.. ‘‘ముందుకు వెళ్లకండి. నేను హ్యాండిల్ చేస్తాను’’ అన్నవి అతడి చివరి మాటలు. ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా కమాండోలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ‘‘నా కొడుకు చనిపోలేదు. బతికే ఉన్నాడు’’ అని అంటుంటారు ధనలక్ష్మి.. ఎవరు ఆనాటి సంఘటనను ప్రస్తావించినా. అశోక్ కామ్తే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎటాక్ జరుగుతున్న ఏరియా అతడి పరిధిలోని కాదు. కానీ టెర్రరిస్టులు అనగానే అక్కడి ఆఫీసర్స్కి సహకారం అందించడానికి బయల్దేరాడు. సి.ఎస్.ఎం.టి. రైల్వే స్టేషన్లో హేమంత్ కర్కరేకి, విజయ్ సలాస్కర్కి జత కలిశాడు. వారితో కలిసి క్వాలిస్ జీప్ ఎక్కాడు. వీళ్ల జీప్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుంటే.. చివరి వరకు అతడి తుపాకీ గర్జిస్తూనే ఉంది. కర్కరే, సలాస్కర్, తర్వాత అశోక్ కామ్తే టెర్రరిస్టుల బులెట్లకు బలి అయ్యాడు. అశోక్ కామ్తే, వినీత కుటుంబం: అశోక్, ఆయన భార్య వినీత, ఇద్దరు కొడుకులు రాహుల్, అర్జున్, అశోక్ తల్లిదండ్రులు, చెల్లి షర్మిల అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. అశోక్ మరణంతో ఆ కుటుంబం ఆత్మస్థయిర్యం సడలింది కానీ, అశోక్ భార్య ధీశాలిగా కుటుంబం కోసం నిలబడ్డారు. భర్త జీవిత చరిత్రను ‘టు ద లాస్ట్ బుల్లెట్’ అనే పుస్తకంగా తెచ్చారు. వినీత లా చదివారు. కార్మికుల కేసులను వాదిస్తుంటారు. అశోక్ చనిపోయాక, ఆయన ఉండే గదికి ఆ కుటుంబం ఒక బోర్డును పెట్టింది. ‘‘మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం. మీరు మా హీరో’ అని అందులో రాసి ఉంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే తన భర్త.. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడని వినీత ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విజయ్ సలాస్కర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. యాంటీ–ఎక్స్టార్షన్ (బలవంతపు వసూళ్ల నిరోధం) హెడ్డు. కర్కరే, కామ్తేలతో పాటు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. విజయ్ సలాస్కర్ భార్య స్మిత కుటుంబం: విజయ్ సలాస్కర్ భార్య స్మిత. కూతురు దివ్య ఏకైక సంతానం. విజయ్ చనిపోయేటప్పటికే ఆమె వయసు 21. ‘‘డాడీ ఎప్పుడూ త్వరగా ఇంటికి రారు. కానీ ఆ రోజు రాత్రి (నవంబర్ 26) త్వరగా వచ్చారు. ‘‘త్వరగా వచ్చారేంటి డాడీ’’ అన్నాను. ‘‘నిన్ను సర్ప్రైజ్ చేద్దామనీ’’ అని నవ్వుతూ అన్నారు. ‘‘అయితే లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తినాల్సిందే’’ అన్నాను. మమ్మీ తిట్టింది. ‘‘ముందు ఆయన్ని భోజనం చెయ్యనివ్వు. తర్వాత వెళ్దువు’’ అంది. నేను.. నా బెడ్రూమ్లోకి వెళ్లాను. అంతే. ఆ తర్వాత డాడీకి ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్లిపోయారు. 11.57 కి ‘‘ఎక్కడున్నారు?’’ అని మమ్మీ డాడీకి ఫోన్ చేసింది. ‘‘స్పాట్’లో అని చెప్పారట డాడీ. చెప్పుడూ చెప్పే జవాబే! ‘‘ఇదేం బాగోలేదు’’ అంటోంది మమ్మీ. కొంతసేపటి తర్వాత టీవీ స్క్రోలింగ్‌లో డాడీ చనిపోయినట్లు వచ్చింది’’.. అని మాత్రం షేర్ చేసుకోగలుగుతున్నారు దివ్య. ఆ తర్వాతి ఘటనలు గుర్తు చేసుకోడానికి ఆమె ఇష్టపడడం లేదు. వీళ్లైదుగురే కాదు. బ్రేవ్ హార్ట్స్ ఇంకా ఉన్నాయి. హవల్దార్ గజేంద్రసింగ్, నాగప్ప మహాలే, కిశోర్, షిండే, సంజయ్ గోవిల్కర్ వంటి ఎందరో ఉగ్రమూకలతో ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షతగాత్రులయ్యారు. పాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షత గాత్రులయ్యారు. -
ఐ విల్ మిస్ యూ బ్రదర్: లలిత్ మోదీ
లండన్: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న లలిత్ మోదీ.. హిమాన్షు రాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘ఐ రియల్లీ మిస్ యూ. నీ ఉద్యోగ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించావు. కానీ నీ ఆత్మహత్యకు కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. మా గుండెల్లో ఎప్పుడూ నీవు చిరస్థాయిగా ఉంటావు. ఇకనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో..ఇక నీకు ఏ బాధ ఉండదూ. నీవు ఒక మెరిసే నక్షత్రానివి’ అని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. శుక్రవారం హిమాన్షు రాయ్ ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్‌ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్‌మఠ్’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది.కాగా, ఏడాదిన్నరగా మెడికల్ లీవ్‌లో ఉన్న హిమాన్షు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. May you #restinpeace my brother. I Really will miss u. You were doing so well but ...I understand.... you will always be in our heart. Go my brother and now rest. No more Pain. Just Love 😢💔 u were the brightest of the ⭐️ and it was truly a blessing to have u watch over us. 😢 pic.twitter.com/00Bf6GjHms — Lalit Kumar Modi (@LalitKModi) 11 May 2018 -
మహారాష్ట్ర ఏటీఎస్ మాజీ చీఫ్ ఆత్మహత్య
సాక్షి, ముంబాయి : మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఆయన ముంబయిలోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. కాగా హిమాన్షు రాయ్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ‘మరాఠీ దినపత్రిక లోక్‌మాతా’ పేర్కొంది. అంతేకాకుండా ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్న హిమాన్షు ఏడాదిన్నరగా మెడికల్ లీవ్‌లో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాంబే ఆస్పత్రికి తరలించారు. 1988 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హిమాన్షు రాయ్ ...2013లో సంచలనం సృష్టించిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు విందు దారా సింగ్‌ను అరెస్ట్ చేశారు. వీటితో పాటు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ డ్రైవర్ ఆరీఫ్ కాల్పులు కేసు, జర్నలిస్ట్ జాడే హత్యకేసు, విజయ్ పాలెండే, లైలా ఖాన్ డబుల్ మర్డర్ కేసుల విచారణలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. -
లక్నోలో ముగిసిన ఎన్కౌంటర్
-
లక్నోలో ఎన్కౌంటర్
► ఇంట్లో దాక్కొన్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు ► రంగంలోకి ఏటీఎస్, పారామిలటరీ కమాండోలు లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులో ఒక ఇంట్లో దాక్కొన్న ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు మంగళవారం అర్థరాత్రి వరకూ ఆపరేషన్ కొనసాగింది. కేంద్ర నిఘా విభాగాలు అందించిన సమాచారం మేరకు లక్నో ఠాకూర్గంజ్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉగ్రవాది నక్కినట్లు గుర్తించిన పోలీసులు... మంగళవారం యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్)తో కలిసి ఆ ఇంటిని చుట్టుముట్టారు. కొద్దిసేపటి అనంతరం ఆ ఇంట్లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. వారి వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి వరకూ ఏటీఎస్ సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఎటీఎస్ సిబ్బందికి సాయంగా పారామిలటరీ బలగాలకు చెందిన కమాండోల్ని సంఘటనా స్థలానికి తరలించారు. దాదాపు 20 మంది కమాండోలు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో దాక్కొన్న ఒక వ్యక్తిని సైఫుల్‌గా అనుమానిస్తున్న పోలీసులు అతనికి భోపాల్–ఉజ్జయిన్ రైలు పేలుడుతో సంబంధాలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ( భోపాల్ రైలులో పేలుడు ) ఉగ్రవాదులను పట్టుకునేందుకు అర్థరాత్రి వరకూ ప్రయత్నాలు కొనసాగించినా అవి విజయవంతం కాలేదు. ఏటీఎస్ ఆపరేషన్ కొనసాగుతుందని, ఐసిస్, దాని సాహిత్యంతో అనుమానితులు ప్రభావితమయ్యారని యూపీ అదనపు డీజీ దల్జీత్ చౌదరీ చెప్పారు. కాన్పూర్‌లో ఇద్దరు, ఇటావాలో ఒక అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాన్పూర్‌లో అరెస్టు చేసిన ఇద్దరితో లక్నో అనుమానితులకు సంబంధాలుండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు.