breaking news
annamaiah bhavan
-
టీటీడీ బోర్డు సమావేశం, ఉమాపతికి సంతాపం
సాక్షి, తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో సమావేశమైంది. లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 60 రోజులుగా శ్రీవారి దర్శనం నిలిచిపోయిన తరుణంలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ బోర్డు భేటీ అయింది. బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి నుంచి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటుండగా మిగిలిన సభ్యులు వారివారి స్వస్థలం నుంచి పాల్గొన్నారు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహిస్తోంది. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి) సమావేశం ప్రారంభంగా కాగానే ముందుగా టీటీడీ మాజీ ఈవో కే.ఉమాపతిరావు మృతికి టీటీడీ బోర్డు సంతాపం తెలిపింది. సుమారు 36మంది సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు అన్నమయ్య భవన్లో మూడు పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ ఆస్తుల విక్రయాలపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇప్పటికే ఈ అంశం వివాదాస్పదంగా మారడం, ప్రభుత్వం గత పాలకమండలి తీర్మానాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశంపై పాలకమండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. (వెంకన్న సాక్షిగా.. పాపాలన్నీ బాబువే) అలాగే మార్చి 20వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలు నిలిపివేత కారణంగా టీటీడీ ఇప్పటికే రూ.400 కోట్ల రాబడి కోల్పోయింది. మే నెల జీతాలు చెల్లింపు తరువాత టీటీడీ వద్ద నిధుల కొరత ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నిధులు వాడకుండా ఓడీ (ఓవర్‌డ్రాప్ట్)కి వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎస్బీఐలో టీటీడీకి రూ.300 కోట్లు ఓడీ 0.75 శాతం వడ్డీకే లభించే అవకాశం ఉంది. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి – ఈనెల 3న శ్రీవారికి సీఎం పట్టువస్రాల సమర్పణ – ఉత్సవాల్లో రెండు ఘాట్‌రోడ్లలో వాహనాల అనుమతి సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేశామని టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథి గృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుంచి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు. భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదే స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవర్ల దర్శనం కల్పిస్తామన్నారు. గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సుట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు. శ్రీవారి భక్తుల వైద్యసేవల కోసం 12 ప్రథమ చికిత్సా కేంద్రాలు , 10 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. సాధారణరోజుల్లో 3500 మంది పోలీసులు, గరుడ సేవలో మొత్తంగా 4700 మందిని భద్రతకు వినియోగిస్తామన్నారు. ఈనెల 3వ తేది ధ్వజారోహణం సందర్భంగా సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అదే సందర్భంలో టీటీడీ డైరీ, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారన్నారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, గడిచిన బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దష్టిలో ఉంచుకుని మరింత ఉన్నతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. వాహన సేవలతోపాటు శ్రీవారి ఆలయంలో మూలవర్ల దర్శనంకోసం తరలివచ్చే భక్తులకోసం క్యూలైన్లు విస్తరించామన్నారు. సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ, భక్తుల భద్రతే ధ్యేయంగా భద్రత కల్పించామన్నారు. ఉత్సవాలకోసం రెట్టింప స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు.