breaking news
anandi ben
-
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
న్యూఢిల్లీ: కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్(68)ను నియమిస్తూ శనివారం రాష్ట్రపతి భవన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న కేసరీనాథ్ త్రిపాఠీ స్థానంలో ధంకర్ బాధ్యతలు చేపడతారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బెంగాల్లో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య పోరు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం చేపట్టడం గమనార్హం. ధంకర్ 1990–91 సంవత్సరాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, 2018 జనవరి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్‌ను కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. ఆనందీ బెన్ స్థానంలో బీజేపీ కురువృద్ధ నేత, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఫగు చౌహాన్ బాధ్యతలు చేపడతారని ఆ సర్క్యులర్ వెల్లడించింది. త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత రమేశ్ బైస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పదవీ కాలం 27న ముగియనుంది. నాగాలాండ్ గవర్నర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డు స్పెషల్ డైరెక్టర్ ఎన్.రవి నియమితులయ్యారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి నాగా వేర్పాటువాదులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 1950లో యూపీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ ఆనందీబెన్. అంతకుముందు ఉన్న యునైటెడ్ ప్రావిన్సుకు 1947లో సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
అమిత్ షాది విజయమా, అపజయమా?
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా తన విధేయుడైన విజయ్ రుపానిని ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా విజయం సాధించారు. కానీ ఆయనకు ఇది నిజంగా విజయమేనా? అపజయం నుంచి వచ్చిన విజయం కాదా? గత కొన్ని రోజులుగా గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ తాజా పరిణామం ఆయన విజయం కాదని, ప్రత్యామ్నాయాన్ని సూచించడంలో మాత్రమే ఆయన విజయం సాధించినట్లు అర్థమవుతోంది. గత ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను అమిత్ షా తప్పించాలనుకోవడం కొత్త విషయం కాదు. కానీ ఆమెను ఇప్పుడే తప్పించాలని భావించలేదు. ఆమెకు 75 (నవంబర్ 21వ తేదీన ఆమె పుట్టిన రోజు) ఏళ్లు నిండిన తర్వాత, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆమెను ముఖ్యమంత్రి పదవిని తప్పించాలని అమిత్‌షా భావించారు. అప్పటికి రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ తర్వాత ఆమెను తప్పించి ఎన్నికలకు సారథ్యం వహించడంలో భాగంగా తానే గుజరాత్ సీఎం బాధ్యతలు స్వీకరించాలని ఆయన భావించారు. అందుకనే ఆయన తదుపరి పార్టీ అధ్యక్షుడికి వదిలేయాలనే ఉద్దేశంతో పార్టీ కేంద్ర కమిటీలను పునరుద్ధరించలేదు. ఈ విషయం ఇటు బీజేపీలో, అటు సంఘ్ పరివార్‌లో ముఖ్య నాయకులందరికి తెల్సిందే. అమిత్ షా అంచనాలను ఆనందిబెన్ పటేల్ తన రాజీనామా నిర్ణయం ద్వారా తలకిందులు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆమె సీఎం పదవి నుంచి తప్పుకుంటారని పార్టీ పెద్దలు భావించారు. కానీ పటేల్ అధిష్టానంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే సోషల్ మీడియా ద్వారా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి అమిత్ షా పేర్లు చక్కర్లు కొట్టింది. అందుకు కారణం అంతుకుముందు పటేల్ స్థానంలో అమిత్ షానే ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నాయకులు భావించడమే. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ తప్పిదనం అవుతుందని ఆయన భావించారు. అందుకని కొన్ని రోజులపాటు పార్టీ పెద్దలతో తర్జనభర్జనలు పడి చివరకు తన విధేయుడైన విజయ్ రుపానీని ఎంపిక చేశారు. ఆయన కూడా అమిత్ షాలాగా జైనుడే. బీసీలు, పటేళ్ల ఆందోళనతో రగిలిపోతున్న గుజరాత్లో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపిస్తారా, అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే.