టెన్టనాటెన్
‘టెన్టనాటెన్ టెన్టనాటెన్ టెన్టనాటెన్..’ కాజల్‌పై టన్నుల కొద్దీ అభిమానం ఉన్న వారు పాడుకునే పాట ఇది! ఆమె ఫాలోయింగ్‌ని చూసి కొంతమంది జల్జలాజల్ జల్జలాజల్ జల్జలాజల్ అనుకుంటున్నారు. ‘జల్నా’ అంటే హిందీలో అసూయ పడడం. అభిమానులు దీనికి కూడా ఇంకో తిరగమోత వేశారు. జల్జలాజల్ జల్జలాజల్ జల్జలాజల్ అంటే.. నీళ్ల లాగా (హిందీలో ‘జల్’ అంటే నీళ్లు) ఏ పాత్రలోనైనా ఒదిగిపోయేదే కా‘జల్’ అని! తనకు నచ్చిన పది సీక్రెట్లు చెప్పింది కాజల్. ఆ సీక్రెట్లు మా దగ్గరే ఉండిపోతే ఏం లాభం?
3 థ్రిల్లింగ్ టాపిక్స్ 10 సర్ప్రైజింగ్ పాయింట్స్ జీవిత ఆశయాలు
ఎగిరిపోతే ఎంత బాగుంటుందో!
ఒంటరి ప్రయాణం చేయాలన్నది నా కోరిక. ఇప్పటివరకూ ఒక్కదాన్నీ ఎక్కడికీ వెళ్లింది లేదు. ఈ ప్రయాణం ఫన్ కోసం మాత్రమే కాదు.. ఒంటరిగా వెళ్లినప్పుడు బోల్డన్ని విషయాలను డీల్ చేయాల్సి వస్తుంది. అలా చేసేటప్పుడు ఎలా జీవించాలి? అనే విషయంపై కొంత అవగాహన పెరుగుతుంది.
ఈ దూకుడు.. ఎప్పుడు?
సినిమాల్లో హీరోలు బంగీ జంప్ చేసినప్పుడు ఆ డేరింగ్ చూసి థ్రిల్ అయిపోతా. సేమ్ టైమ్ నా గుండె వేగం పెరుగుతుంది. నాకూ బంగీ జంప్ చేయాలని ఉంది. కానీ, అంత ఎత్తు నుంచి దూకాలంటే భయం. ఆ భయం పోగొట్టుకోవడానికి ఒక్కసారైనా బంగీ జంప్ చేయాలనుకుంటున్నా. మరి.. దూకే టైమ్ ఎప్పుడొస్తుందో? (నవ్వుతూ).
కెవ్వుమంటా
మూగజీవాలంటే ఇష్టం, భయం. ముఖ్యంగా కుక్కపిల్లలంటే. అవి దగ్గరికొస్తే చాలు.. కెవ్వు కేక పెట్టేస్తా. ఎప్పటికైనా ఒక కుక్కపిల్లను పెంచుకుని ఆ భయం పోగొట్టేసుకోవాలనుకుంటున్నా.
వాయించేస్తా
మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. చిన్నప్పుడు కొన్నాళ్లు పియానో నేర్చుకున్నా. ఇప్పుడు మళ్లీ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నా. తబలా వాయించాలని ఆశ. ఇదే మాట నా ఫ్రెండ్స్‌తో అంటే ‘నీ ఫింగర్స్ లేతగా ఉన్నాయి.. తబలా వాయిస్తావా?’ అని ఆటపట్టిస్తుంటారు. తబలా నేర్చుకుని నా లేడీ ఫింగర్స్ పవరేంటో చూపించాలని ఉంది.
ఫారిన్ టాక్
ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మాట్లాడేయాలనే కోరిక ఉంది. అది అత్యాశ అని నాకు తెలుసు. భాషల మీద నాకెంత ప్రేమ అంటే.. తెలుగు సినిమాల్లోకొచ్చిన కొద్ది రోజులకే తెలుగు నేర్చుకున్నా. అలాగే, తమిళం కూడా మాట్లాడగలుగుతాను. ఇంకా ఓ విదేశీ భాష నేర్చుకోవాలని ఉంది. జర్మన్, స్పానిష్, ఫ్రెంచి.. ఏదో ఒకటి నేర్చుకుంటా.
చదివేస్తా!
చదువంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్‌లో బాగా చదువుకునేదాన్ని. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను. ఎంబీఏ చేయాలని కోరిక. సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేయాలనుకున్నా. కుదరలేదు. చదువుకి ఏజ్‌తో సంబంధం లేదు కాబట్టి, ఎప్పటికైనా ఎంబీఏ పట్టా సాధించేస్తా.
కాల్చుకుంటున్నా
నేను ఫుడ్ లవర్ని. ఏది తిన్నా ఆస్వాదిస్తూ తింటా. మా అమ్మ బెస్ట్ కుక్. అమ్మలా వంట చేయాలని చాలాసార్లు ట్రై చేశాను. చెయ్యి కాలింది తప్ప వంట కుదరలేదు. ఎప్పటికైనా అమ్మ అంతటి కుక్ కావాలని ఉంది. నేను చెప్పిన లిస్టులో దాదాపు అన్నీ సాధించగలనేమో కానీ, అమ్మలా వంట చేయలేనేమో. ఆమె చేతుల్లో ఏదో మేజిక్ ఉంది.
బ్యాడ్ గాళ్‌ని
చిన్నప్పుడు క్రికెట్ ఆడేదాన్ని. అయితే నాకు టెన్నిస్ అంటే ఇష్టం. అది గమనించి అమ్మానాన్న నన్ను టెన్నిస్‌లో చేర్పించారు. క్లాసెస్‌కి వెళ్లిన తర్వాత ఫోకస్ చేయలేకపోయాను. అందుకని క్లాసెస్‌కి వెళుతున్నానని చెప్పి, పక్కనే ఉన్న పార్క్‌లో కూర్చునేదాన్ని. అలా చేసినందుకు ఇప్పుడు ఫీలవుతున్నా. మళ్లీ టైమ్ చూసుకుని క్లాసెస్‌కి వెళ్లాలనుకుంటున్నా. అప్పుడు బ్యాడ్ గాళ్. ఇప్పుడు గుడ్ గ్యాళ్ని. అందుకని బుద్ధిగా క్లాసెస్‌కి వెళ్తా.
ఆ ఫుడ్స్‌పై ఫోకస్ పెడతా!
మా నాన్నగారు బిజినెస్ మ్యాన్. ఆయనలాగే వ్యాపారంలో రాణించాలనుకుని నా చెల్లెలితో కలిసి ‘మార్సలా’ జ్యూవెలరీ మొదలుపెట్టా. అది బాగానే ఉంది. ఫిట్నెస్ అండ్ ెహ ల్త్ కోసం ఏదైనా చేయాలని ఉంది. ముఖ్యంగా ఫిట్నెస్ ఫుడ్స్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. ఏం తినాలి? ఏది తినకూడదు? అనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండటంలేదు. అందుకే ఫిట్నెస్ ఫుడ్స్ మీద ఏదైనా చేయాలనుకుంటున్నా.
మింగేస్తాయని భయం...
చిన్నప్పుడు హారర్ మూవీస్ ఎక్కువగా చూసేదాన్ని. ‘జాస్’, ‘షార్క్’ చిత్రాల ప్రభావం నా మీద చాలా ఉంది. ఈత కొలనులోకి దిగగానే అవి గుర్తొచ్చేస్తాయ్. నీళ్లల్లో అవి ఉన్నాయని అనుమానం. షార్కులు మింగేస్తాయని భయం. చీకటి అంటే కూడా చాలా భయం. స్విమ్ చేసేటప్పుడు కలిగే భయాన్నీ, చీకటంటే ఉన్న భయాన్నీ జయించాలన్నది నా ఆశయం.
బాలి, లండన్, నార్వే, లాట్వియా, స్లొవేనియా, న్యూయార్క్, జమ్మూ అండ్ కశ్మీర్, గోవా, పాండిచ్చేరి, కన్యాకుమారి... ఇవన్నీ నా ఫేవరెట్ ప్లేసెస్సే. చాలాసార్లు వెళ్లాను. అయినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. ఇప్పటివరకూ ఈశాన్య రాష్ట్రాలను ఎప్పుడూ చూడలేదు. అక్కడికి వెళ్లాలనుకుంటున్నా.
అమృత్‌సర్‌లో మా బంధువులు చాలామంది ఉన్నారు. మా అమ్మగారి ఊరు కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పుడు వెళ్లేదాన్ని. ఈ మధ్యకాలంలో అమృత్సర్ వెళ్లలేదు. నా ఫేవరెట్ ప్లేసెస్ లిస్ట్‌లో అమృత్సర్ది ఫస్ట్ ప్లేస్.
10డ్రెస్సావతారం
1. ‘లక్ష్మీ కల్యాణం’లో కట్టుకున్న హాఫ్ శారీ
2. ‘బిజినెస్‌మేన్’ సినిమాలో బీచ్ సాంగ్‌లో వేసుకున్న జీన్స్ షార్ట్స్, వైట్ షర్ట్.
3. ‘డార్లింగ్’ సినిమాలో వేసుకున్న బ్లౌజులు, పెట్టుకున్న టోపీలు
4. ‘మగధీర’లో యువరాణి గెటప్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్.
5. ‘గోవిందుడు అందరివాడేలే’లో వాడిన ఆఫ్ వైట్, రెడ్ కాంబినేషన్ హాఫ్ శారీ.
6. ‘టెంపర్’లో పింక్ కలర్ మోడ్రన్ అవుట్‌ఫిట్.
7. ‘ఓం శాంతి’ సినిమాలో వేసుకున్న నీలం రంగు డ్రెస్
8. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో బేబీ పింక్ శారీ కట్టుకున్నా. అది లవ్లీగా ఉంటుంది.
9. ‘నాయక్’ సినిమాలో పర్పుల్, రెడ్ కాంబినేషన్ స్లీవ్‌లెస్ ఫ్రాక్.
10. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ఆరెంజ్ డాట్స్, పర్పుల్ కలర్ కాంబినేషన్‌తో చేసిన డిజైనర్ హాఫ్ శారీ.
ఫేవరెట్ ప్లేసెస్
1. లండన్
2. గోవా
3. జమ్ము కాశ్మీర్
4. అమృత్సర్