27న భద్రాద్రిలో జిల్లా స్థాయి కూచిపూడి పోటీలు
భద్రాచలం టౌన్: భద్రాచలంలో ఈనెల 29వ తేదీన అభినయ కూచిపూడి నాట్యాలయం ఆధ్వర్యంలో స్థానిక రాజవీధిలోని చిన్నజీయర్ మఠంలో జిల్లాస్థాయి కూచిపూడి నృత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం ప్రకటనలో తెలిపారు.29న ప్రపంచ నృత్య దినోత్సవం, అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ పోటీలలో కేవలం అన్నమయ్య కీర్తనలకే నృత్య ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుందని, జూనియర్స్, సీనియర్స్, గ్రూప్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రదర్శన 10 నిమిషాలకు మించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, ఆసక్తి ఉన్న వారు ఈనెల 25 లోపు తమ పేరును న మోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 99596 52886, 9848297637 నంబర్లను సంప్రదించాలని కోరారు.