
భారతదేశంలో మొత్తం 137 ఎయిర్‌పోర్టులున్నాయి. వీటిలో 24 ఇంటర్నేషనల్ కాగా, 10 ఎయిర్‌పోర్ట్‌లు కార్గో రవాణా కోసం కస్టమ్స్ వారు ఉపయోగించుకుంటున్నవి.

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు * మూడు టర్మినళ్లు, ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణం * ప్రపంచంలో అతి పెద్ద ఎయిర్‌పోర్టుల్లో పన్నెండవది

ముంబై : ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * రోజుకు వెయ్యి విమానాలు, ఏడాదికి 3 కోట్ల ప్రయాణీకులు * 2 టర్మినళ్లతో అంధేరీలో నిర్మించారు

బెంగళూరు : కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * రోజుకు 700 విమానాలు, ఏడాదికి 2 కోట్ల ప్రయాణీకులు * పూర్తిగా సోలార్ విద్యుత్‌తో నడుస్తోన్న ఎయిర్‌పోర్టు

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * రోజుకు 600 విమానాలు, ఏడాదికి కోటికి పైగా ప్రయాణీకులు * డొమెస్టిక్ టర్మినల్‌లో ప్రత్యేకంగా ఎయిరో బ్రిడ్జిలు

కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * ఏడాదికి కోటిన్నరకు పైగా ప్రయాణీకులు * దేశంలో నిర్మించిన పురాతన ఎయిర్‌పోర్టులలో ఇదొకటి (1924)

హైదరాబాద్ : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * ఏడాదికి కోటిన్నరకు పైగా ప్రయాణీకులు * అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్ట్

అహ్మదాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణీకులు * మూడు టర్మినళ్లు, ఒకే రన్ వే

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * ఏడాదికి 50 లక్షల మంది ప్రయాణీకులు * పూర్తిగా సోలార్ విద్యుత్ వినియోగం

పుణె ఎయిర్‌పోర్టు * ఏడాదికి 40 లక్షల మంది ప్రయాణీకులు * అత్యంత పరిశుభ్రంగా ఉండే ఎయిర్‌పోర్టుగా పేరు

గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు * ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణీకులు * అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న గమ్యస్థానం