ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేసిన సిఫార్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. శనివారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేసిన సిఫార్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. శనివారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాను రాజీనామా చేసిన వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని, లేదా రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిఫార్సు చేసినా.. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ మాత్రం తొలుత అసెంబ్లీని సుప్త చేతనావస్థలోనే ఉంచారు.
చివరకు విమర్శలు తట్టుకోలేక.. రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఆయన సిఫార్సును కేంద్ర కేబినెట్ వెంటనే ఆమోదించింది. కేజ్రీవాల్ రాజీనామా నేపథ్యంలో ఢిల్లీ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ భేటీలో మంతనాలు జరిపారు. ఆరు నెలల వరకు ఢిల్లీలో ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతోనే హడావుడిగా రాష్ట్రపతి పాలనకు ఆమోదం చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు జరిగితే మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావచ్చని, ఆ పరిస్థితి ఉండకూడదనే రాష్ట్రపతి పాలన విధించారని పరిశీలకులు భావిస్తున్నారు.