కెనడాలో ఉగ్రదాడి!

Canadian police probe car attacks, stabbing as 'acts of terrorism'

ఎడ్మంటన్‌:కెనడాలోని ఎడ్మంటన్‌లో ఓ అనుమానిత ఉగ్రవాది బీభత్సం సృష్టించాడు. తొలుత కారు తో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారిని ఢీకొట్టి , కత్తితో దాడి చేశాడు. ఆ తరువాత ట్రక్కుతో రద్దీగా ఉన్న వీధిలో పాదచారులపైకి దూసుకెళ్లి నలుగురిని గాయపరిచాడు. ఈ రెండు ఘటనలపై ఉగ్రకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాడులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కారుతో వేగంగా దూసుకొచ్చి పోలీసు అధికారిని ఢీకొట్టడంతో, ఆ అధికారి గాలిలో 15 అడుగుల ఎత్తు ఎగిరిపడ్డాడు. ఆ వెంటనే కారులోంచి కిందికి దూకిన దుండగుడు కత్తితో అతన్ని పలుమార్లు పొడిచాడు. ఆ కారులో నుంచి ఐసిస్‌ జెండాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి ట్రక్కుతో పారిపోయిన దుండగుడు పోలీసులు వెంటపడుతుండటంతో జాస్పర్‌ అవెన్యూ ప్రాంతంలో పాదచారులను ఢీకొట్టాడు. ఈ క్రమంలో ట్రక్కు పక్కకు పడిపోయింది. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top