బ్లాక్‌బెర్రీ ‘9720’ స్మార్ట్‌ఫోన్ | BlackBerry 9720 smartphone launched in India at Rs 15990 | Sakshi
Sakshi News home page

బ్లాక్‌బెర్రీ ‘9720’ స్మార్ట్‌ఫోన్

Sep 13 2013 1:41 AM | Updated on Sep 1 2017 10:39 PM

బ్లాక్‌బెర్రీ ‘9720’ స్మార్ట్‌ఫోన్

బ్లాక్‌బెర్రీ ‘9720’ స్మార్ట్‌ఫోన్

కెనడాకి చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ గురువారం మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ముంబై: కెనడాకి చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ గురువారం మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లాక్‌బెర్రీ 9720ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 15,990. ఈ వారాంతం నుంచి ఇది మార్కెట్లో లభ్యమవుతుందని బ్లాక్‌బెర్రీ ఇండియా ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం హెడ్ అద్వైత్ వైద్య తెలిపారు. బ్లాక్‌బెర్రీ కొత్త ఆపరేటింగ్ సిస్టం... 7.1పై రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2.8 అంగుళాల టచ్‌స్క్రీన్, క్వెర్టీ కీబోర్డు, ట్రాక్ ప్యాడ్, 5 మెగాపిక్సెల్ కెమెరా, ఎఫ్‌ఎం రేడియో వంటి పలు ముఖ్యమైన ఫీచర్లు ఉంటాయి. వై-ఫైలో ఉచితంగా చాటింగ్ చేసుకునేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్ బీబీఎం వాయిస్‌ను కూడా బ్లాక్‌బెర్రీ ఇందులో పొందు పరచడం విశేషం. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పూర్వ ప్రాభవాన్ని దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న బ్లాక్‌బెర్రీ ఈ ఏడాదిలో ఇప్పటికే జెడ్10, క్యూ5 ఫోన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement