రైతురుణాల రీషెడ్యూల్‌పై తెలంగాణ ప్రభుత్వం పంపిస్తున్న నివేదికలపట్ల రిజర్వ్ బ్యాంకు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు.
	గత ఖరీఫ్‌కు అర్హత లేదంటూ త్వరలో లేఖ
	 
	 సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ : రైతురుణాల రీషెడ్యూల్‌పై తెలంగాణ ప్రభుత్వం పంపిస్తున్న  నివేదికలపట్ల రిజర్వ్ బ్యాంకు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. మాఫీ ప్రయత్నాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం రుణాల రీషెడ్యూల్‌తో ప్రస్తుతానికి సరిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు బ్యాంకు అనుమానిస్తోంది. అందుకే ప్రభుత్వం పంపించే లెక్కలను విశ్వాసంలోకి తీసుకోకుండా గత ఖరీఫ్‌కు సంబంధించిన దిగుబడులపై సొంతంగా గణాంకాలను సేకరించింది. హైదరాబాద్‌లోని ప్రాంతీయ ఆర్‌బీఐ విభాగం, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర అర్థగణాంక విభాగం నుంచి ఈ సమాచారాన్ని సేకరించింది. ఆ లెక్కల ఆధారంగా గత ఖరీఫ్‌కు రీషెడ్యూల్ అర్హత లేదని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ దీపాలీ పంత్ జోషి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖను పంపించనున్నారని తెలుస్తోంది. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
