ఫేస్‌బుక్‌ పరిచయాలు..ప్రాణాలకు ముప్పు

Parents Keep Your Kids Away From Smart Phones And Social Media - Sakshi

వ్యసనంలా స్మార్ట్‌ఫోన్ల వినియోగం

నకిలీ ఖాతాలతో అమ్మాయిలు, యువతులను టార్గెట్‌ చేస్తున్న నేరగాళ్లు

అప్రమత్తత, స్వీయ నియంత్రణే ముద్దంటున్న ప్రముఖులు 

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం/జడ్చర్ల : రోజురోజుకు విశ్వవ్యాప్తంగా కొనసాగుతున్న సోషల్‌మీడియా జీవితాలను శాసిస్తుంది. ప్రధానంగా వాట్సా ప్,ఫేస్‌బుక్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ముక్కు మొఖం తెలియని వారితో పరిచయాలు, పొద్దస్తమానం సంభాషణలు, రాత్రిల్లు చాటింగ్‌లతో కాలాన్ని కర్పూరంలా హరించేస్తున్నారు. దీనికి తోడు కన్నవారిని, ప్రేమ పంచిన బంధువులను సైతం దూరం పెట్టి ఎక్కడున్నారో తెలియని వారితో సామాజిక మాద్యమాలలో మాట్లాడుతూ వారికి దగ్గరై జీవి తాల ను నిలువునా కూల్చుకుంటున్నారు. తాజాగా జడ్చర్లకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఇలాంటి కోవలోనే ఎంతమాత్రం పరి చయం లేని నవీన్‌రెడ్డితో ఫేస్‌బుక్‌ ద్వార పరిచయమై ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

మాహా మాయగాళ్లుంటారు
సామాజిక మాద్యమాల ద్వార తప్పుడు పోస్టింగ్‌లు, ఆకర్శనీయమైన ఫొటోలు, తదితర ఆకట్టుకునే సంభాషణలు పెట్టి అమాయక అమ్మాయిలను ముగ్గులోకి దింపే మహామాయగాళ్లు అనేకమంది ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండడం తప్పా మరే మార్గం లేదని వారు పేర్కొంటున్నారు. వారిచ్చే పొగడ్తలకు పడిపోయారంటే క్రమేణా వారి వలలోకి జారుతున్నట్లేనని చెబుతున్నారు. ముఖ్యంగా బాలికలు, యువతులు, మహిళలు ఫేస్‌బుక్, తదితర సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండడమే మేలని వారు సూచిస్తున్నారు. అమ్మాయిలో పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లు తెరచి వారిలో అమ్మాయిలకు దగ్గరై వారి లోపాలను లేదా తదితర సమాచారాన్ని తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయంటున్నారు. కొందరు మీ వ్యక్తిగత డేటా, ఫొటోలు బయటపెడతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుండగా.. మరికొందరు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. 

దెబ్బతింటున్న బాహ్య సంబంధాలు
ప్రతీ ఒక్కరు తమ స్మార్ట్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ను వినియోగిస్తూ బిజీబిజీగా మారారు. బస్టాప్, రై ల్వేస్టేషన్, తమ కార్యాలయాలు, తదితర ఎక్కడపడితే అక్కడ ఏ మాత్రం సమయం దొరికినా స్మార్ట్‌ ఫోన్‌లో తలదూర్చేస్తున్నారు. పక్కన ఏంజేరుగుతుందన్న విషయాన్ని కూడా ప ట్టించుకోనంతగా గడిపేస్తున్నారు. అన్యోన్యం గా సాగిపోతున్న కాపురాలు సైతం సామాజిక ఖాతాల దెబ్బకు కుదేలవుతున్నాయి. ఒకరిపై ఒ కరికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వీటన్నింటికీ పులిస్టాప్‌ పెట్టాలంటే స్వీయ నియంత్రణే ముద్దు అంటున్నారు నిపుణులు.

పిల్లలు పెడదోవ పట్టేందుకు కారణాలు
► తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచకపోవడం, ఉమ్మడి కుటుంబాల్లో మాదిరిగా పెద్దల వాళ్ల సంరక్షణ కొరవడటం.
► పిల్లల అభిరుచులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం, అడిగిన వస్తువల్లా కొనిచ్చి కనీస పర్యవేక్షణ కొనసాగించకపోవడం. 
► సామాజిక మాద్యమాల్లో ఎక్కువ మంది యువత వికృతాంశాలపై శ్రద్ధ పెంచుకోవడం.
► పాఠశాలకు, కళాశాలకు వెళ్లే వారు బయట ఏం చేస్తున్నారో కుటుంబ పెద్దలు గుర్తించలేకపోవడం.
► పెడదోవ పట్టిన పిల్లలు పట్ల యాజమాన్యాలు వ్యక్తి గత శ్రద్ధ చూపకపోవడం,  ఆ విషయాన్ని తల్లిదండ్రులకు బాధ్యతగా చెప్పకపోవడం.
► చదువుకునే వారు స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై పాఠశాలలో ఇటూ ఇళ్లలో నియంత్రణ కొరవడటం.

ఇవి గమనించాలి..
 సామాజిక మాద్యమాల్లో నకిలీ అకౌంట్‌లతో వేధిస్తుంటే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది. తెలియని ఖాతా నుంచి వచ్చే వాటికి స్పందించకపోవడం శ్రేయస్కరం. 
 తమ పేరు, ఫొటోతో ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్నట్లు దృష్టికి వస్తే వెంటనే పరిశీలించాలి. నిజమని తేలితే దీనిపై సంబంధిత పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలి.  
♦ నకిలీ ప్రొఫైల్స్‌ కనిపిస్తే ఫేస్‌బుక్‌ తదితర సంబంధిత సంస్థలకు కూడా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. చాలా వాటిల్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతోపాటు ఆ ఖాతాలను రద్దు చేస్తారు.
ఐటీ చట్టం 2000 ప్రకారం ఇలాంటి నేరాలు జరిగిన తర్వాత కేసులు నమోదు చేస్తారు. సెక్షన్‌ 66డీ ప్రకారం నకిలీ పేర్లతో ఇతరులను మోసం చేయడం నేరం. సామాజిక మాద్యమాల్లో మారు పేర్లతో ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం దీనికిందకు వస్తోంది. నిందితులను కఠినంగా శిక్ష విధించేలా ఈ చట్టాన్ని 2008లో కూడా సవరించారు. చట్ట ప్రకారం మూడేళ్ల వరకు శిక్ష పడుతుంది. దీంతోపాటు రూ.లక్ష వరకు జరిమాన విధించే అవకాశం ఉంది.

పిల్లలతో సమయం గడపాలి
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు బిజీ కావడం వల్ల వారు పిల్లలతో అధిక సమయం కేటాయించకపోవడం వల్ల కొంత మంది చిన్నారులు ప్రేమ దక్కుతున్న వైపు ఆకర్షణకు గురి అవుతుంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పిల్లలతో ప్రతి రోజు వారితో మాట్లాడుతూ వారి ఇష్టాలు, కళాశాల, పాఠశాలలో జరుగుతున్న విషయాలపై చర్చించాలి. స్మార్ట్‌ఫోన్‌ పిల్లలకు ఓ వ్యసనంలా మారుతోంది. ఇది ఆట వస్తువు కాదని తల్లిదండ్రులు గుర్తించాలి. 
– వంగీపురం శ్రీనాథాచారి, మానసిక విశ్లేషకుడు 

ఫిర్యాదు చేయాలి
సామాజిక మాద్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులచే మోసపోయినా, ఏదైన బెదిరింపులకు గురవుతున్నా వెంటనే వారు పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దాంతో దానిపై కేసు నమోదు చేసి పరిశోదన చేసి నేరస్తులకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి ప్రజల నుంచి కూడా సహకారం అందాలి. జడ్చర్ల ఘటనలో నేరస్తుడిని అతి తక్కువ సమయంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొత్త వ్యక్తులతో సామాజిక మాద్యమాల్లో అంత త్వరగా మాటలు కలిపి మాట్లాడం సరికాదు. ప్రధానంగా అమ్మాయిలు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
– వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top