‘ఆయన రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే’ | jeevan reddy demands CBI probe into Miyapur land scam | Sakshi
Sakshi News home page

‘ఆయన రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే’

Jun 27 2017 3:24 PM | Updated on Sep 2 2018 3:42 PM

‘ఆయన రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే’ - Sakshi

‘ఆయన రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే’

ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: అధికార పార్టీ నాయకుల వైఖరితో ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ప్రభాకర్ రెడ్డి తర్వాత అతని సంబంధీకులు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారిని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమర్జన్సీ కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణలో ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో గజ్వేల్ నియోజకవర్గం చూస్తే అర్థమవుతుందన్నారు.

కుకునూర్ పల్లి ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి  మృతులఫై జ్యుడీషియల్  విచారణ జరిపించి, సీఎం చిత్త శుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. శిరీష మరణానికి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యతో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. మియాపూర్ భూ కుంభకోణంలో సీబీఐ విచారణ జరిపించకుంటే  టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపినట్లే భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే ఉన్నాయని, నియంతపాలన సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement