గిరిజనుల భూముల్లో జేసీబీలతో తవ్వకాలు | forest officers try to occupy tribla lands in khamman district | Sakshi
Sakshi News home page

గిరిజనుల భూముల్లో జేసీబీలతో తవ్వకాలు

Feb 20 2016 3:19 PM | Updated on Oct 4 2018 6:03 PM

ఖమ్మం జిల్లా టేకుపల్లి మండలం కొప్పరాయి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం, బర్లగూడెం గ్రామాల్లో అటవీ అధికారులు శనివారం గిరిజనుల భూముల్లో తవ్వకాలకు ప్రయత్నించగా..

టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకుపల్లి మండలం కొప్పరాయి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడెం, బర్లగూడెం గ్రామాల్లో అటవీ అధికారులు శనివారం గిరిజనుల భూముల్లో తవ్వకాలకు ప్రయత్నించగా... స్థానికులు అడ్డుకున్నారు. సుమారు 125 ఎకరాల్లో గిరిజనులు 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇవి అటవీ భూములు కావడంతో వాటిని స్వాధీనం చేసుకుని వనాలు పెంచాలని అధికారులు నిర్ణయించారు.

దీనిలో భాగంగా గత పది రోజులుగా జేసీబీలతో అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. సుమారు ఏడు గ్రామాల రైతులు శనివారం అక్కడకు చేరుకుని తమ బతుకుదెరువును లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో అటవీ సిబ్బంది పనులు ఆపివేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement