పంట రుణాలను వసూలు చేయటాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక ఎస్‌బీహెచ్ శాఖ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
దుబ్బాక (మెదక్) : పంట రుణాలను వసూలు చేయటాన్ని నిరసిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక ఎస్‌బీహెచ్ శాఖ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ చేసినప్పటికీ రుణాలను వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. దీనిపై బ్యాంకు మేనేజర్ వారితో మాట్లాడారు.
కొన్ని సాంకేతిక కారణాలతోనే కొందరు రైతుల నుంచి మాత్రమే పంట రుణాల అసలు, వడ్డీలను వసూలు చేస్తున్నామని తెలిపారు. వసూలు చేసిన వడ్డీని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.