నా చిత్ర విడుదలను ఆపలేను | Savaale Samaali will surpass the challenges - Kavitha Pandian | Sakshi
Sakshi News home page

నా చిత్ర విడుదలను ఆపలేను

Sep 4 2015 2:09 AM | Updated on Sep 3 2017 8:41 AM

నా చిత్ర విడుదలను ఆపలేను

నా చిత్ర విడుదలను ఆపలేను

నా చిత్ర విడుదలను నిలిపి వేయడం ప్రస్తుత పరిస్థితిలో నా చేతుల్లో లేదని సీనియర్ నటుడు, నిర్మాత అరుణ్ పాండియన్ అన్నారు.

 నా చిత్ర విడుదలను నిలిపి వేయడం ప్రస్తుత పరిస్థితిలో నా చేతుల్లో లేదని సీనియర్ నటుడు, నిర్మాత అరుణ్ పాండియన్ అన్నారు. ఈయన సమర్పణలో కూతురు కవితా పాండియన్ నిర్మించిన చిత్రం సవాలే సమాళి. సత్యశివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశోక్ సెల్వన్, బిందుమాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శుక్రవారం తెరపైకి రానుంది. శుక్రవారం కొత్త చిత్రాలేవీ లేవంటూ తమిళ సినీ నిర్మాతల మండలి ప్రకటించిన నేపథ్యంలో సవాలే సమాళి చిత్ర సమర్పకుడు అరుణ్‌పాండియన్ గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొంటూ తమ చిత్రాన్ని నాలుగో తేదీన విడుదల చేయనున్నట్లు ముందుగానే వెల్లడించాం.
 
 కోట్లు ఖర్చుతో నిర్మించి 100 రోజుల క్రితమే చిత్ర విడుదలకు సన్నాహాలు చేసుకున్నాం. 90 రోజుల క్రితమే సెన్సార్ పూర్తి అయ్యింది. ప్రభుత్వ రాయితీలకు కూడా అనుమతి కోరాం. ప్రచారానికి చాలా ఖర్చు చేశాం. ప్రణాళిక రాష్ట్ర వ్యాప్తంగా 170 థియేటర్లలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేసుకుంటే ఒక్కరోజు ముందు చిత్రాన్ని విడుదల చేయరాదన్న నిర్మాతల మండలి నిర్ణయం సరికాదు. అయినా ఇలాంటి పరిస్థితిలో నా చిత్ర విడుదలను నిలిపి వేయడం నా చేతుల్లో కూడా లేదు.
 
 ఒక వేళ తమిళనాడులో చిత్ర విడుదలను నిలిపి వేసినా విదేశాల్లో చిత్రం విడుదల అవుతుంది. ఆ తరువాత పైరసీ తదితర బాధింపులకు గురి కావలసి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే లింగా చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేసింది నేనే. ఆ చిత్రానికి నేను చాలా నష్టపోయాను. ఈ విషయాన్ని ఏ వేదిక పైనా ఇప్పటి వరకు నేను చెప్పలేదు. అయినా నష్టపరిహారం చెల్లిస్తానన్నారు. ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇకపోతే ఒక్క చెంగల్‌పట్టురియా సమస్య కోసం తమిళనాడు వ్యాప్తంగా చిత్రాల విడుదలను నిలిపి వేయాలన్న నిర్ణయంలో న్యాయం లేదని అరుణ్‌పాండియన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement