
పొలార్డ్ నోటికి ప్లాస్టర్..!
ఏదోక ప్రత్యేకతతో అందరి దృష్టినిక ఆకర్షించే ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
బెంగళూరు: ఏదోక ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షించే ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో చినస్వామి మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో అతడు నోటికి ప్లాస్టర్ వేసుకుని కాసేపు ఫీల్డింగ్ చేశాడు.
పొలార్డ్ మూతికి ప్లాస్టర్ చూసి అతడికి ఏమైనా దెబ్బ తగిలి ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే దెబ్బ తగినట్టు ఎక్కడా కనబడలేదు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే అతడు నోటికి అడ్డంగా ప్లాస్టర్ అతికించుకుని వచ్చాడన్న విషయం అర్థమయి అందరూ నవ్వుకున్నారు. తోటి ఆటగాళ్లు అతడి ప్రవర్తన చూసి నవ్వులు చిందించారు.