30 ఓవర్లో అఫ్ఘానిస్థాన్ 96/5


కాన్ బెర్రా: బంగ్లాదేశ్తో ప్రపంచ కప్ మ్యాచ్లో అఫ్ఘానిస్థాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. బుధవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్ 30 ఓవర్లో  96/5 స్కోరుతో ఎదురీదుతోంది. తాజాగా సమీవుల్లా రనౌటవగా, అంతకుముందు మహ్మదుల్లా బౌలింగ్లో

నవ్రోజ్ క్యాచవుటయ్యాడు. అఫ్ఘానిస్థాన్ ఆరంభంలోనే 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జావెద్ అహ్మది(1), ఆఫ్సర్ జాజాయ్(1), స్టానిక్ జాయ్(1) వెంటవెంటనే అవుటయ్యారు. బంగ్లా బౌలర్లలో మోర్తజా 2 వికెట్లు పడగొట్టాడు.  అంతకుముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top