గుజరాత్ అసెంబ్లీలో ఆల్కహాల్ దాడి | alcohol attack in gujarat assembly | Sakshi
Sakshi News home page

గుజరాత్ అసెంబ్లీలో ఆల్కహాల్ దాడి

Mar 24 2015 6:30 PM | Updated on Jul 18 2019 2:26 PM

గుజరాత్ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆల్కహాల్ వ్యతిరేక ఆందోళనకారుడు బాబూభాయ్ శంకర్‌దాస్ పటేల్ రాష్ట్ర అసెంబ్లీలో ఆల్కహాల్ దాడికి దిగాడు.

గుజరాత్ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆల్కహాల్ వ్యతిరేక ఆందోళనకారుడు బాబూభాయ్ శంకర్‌దాస్ పటేల్ రాష్ట్ర అసెంబ్లీలో ఆల్కహాల్ దాడికి దిగాడు. 70 ఏళ్ల పటేల్ ఓ ప్లాస్టిక్ సంచిలో ఆల్కహాల్ నింపుకొని  అసెంబ్లీ ప్రేక్షకుల గ్యాలరీలోకి ప్రవేశించాడు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండగా ఆల్కహాల్ సంచీ సభలోకి విసిరేసి కరపత్రాలను వెదజల్లాడు.

రాష్ట్రంలో మద్యం నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌తో పాటు సభా స్పీకర్, సభ్యులను ఆ కరపత్రాల్లో డిమాండ్ చేశారు. నాడు ఢిల్లీ అసెంబ్లీలో నాటుబాంబులు విసిరి, కరపత్రాలు వెదజల్లి నిరసన వ్యక్తం చేసిన భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను స్ఫూర్తిగా తీసుకొని వారి సంస్మరణ దినోత్సవం నాడు పటేల్ ఈ ఆల్కహాల్  నిరసనకు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement