కోడలిపై సాక్షాత్తూ అత్తే అత్యాచారం చేయించింది. మైనర్ అయిన చిన్న కొడుకుని రెచ్చగొట్టి పెద్ద కొడలిపై దుశ్చర్యకు పాల్పడేలా ప్రేరేపించింది.
కోడలిపై సాక్షాత్తూ అత్తే అత్యాచారం చేయించింది. మైనర్ అయిన చిన్న కొడుకుని రెచ్చగొట్టి పెద్ద కొడలిపై దుశ్చర్యకు పాల్పడేలా ప్రేరేపించింది. వరకట్న వేదింపులకు గురైన ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటనలో కోర్టు అత్తకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
తన అత్తమామలు కట్నం కోసం వేదిస్తున్నారంటూ ఓ మహిళ ఢిల్లీ ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో 2005లో ఫిర్యాదు చేసింది. మైనర్ అయిన తన మరిది తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తన మరిదిని అత్తే రెచ్చగొట్టిందని ఆరోపించింది. ఆమె కూడా తనతో శారీరకంగా అనుచితంగా ప్రవర్తించిందని తెలియజేసింది. ఈ విషయం గురించి తన భర్తకు చెప్పినా, ఐదు లక్షలు అదనపు కట్నం తెస్తేనే వేదింపులు ఆగేలా చూస్తానన్నాడని పేర్కొంది. కాగా ఫిర్యాదు చేసిన రోజు రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుంది. విచారణ అనంతరం నేరం చేసినట్టు రుజువుకావడంతో ఆమె భర్తకు మూడేళ్లు, అత్తకు ఏడేళ్లు శిక్ష పడింది. మైనర్ నిందితున్ని బాలనేరస్తుల విచారణ కోర్టులో హాజరుపరిచారు.