ఐదో టాటూ వేయించుకున్న శ్రుతి హాసన్ | shruti haasan gets tattoed for the fifth time | Sakshi
Sakshi News home page

ఐదో టాటూ వేయించుకున్న శ్రుతి హాసన్

Aug 16 2014 8:36 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఐదో టాటూ వేయించుకున్న శ్రుతి హాసన్ - Sakshi

ఐదో టాటూ వేయించుకున్న శ్రుతి హాసన్

వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తాజాగా ఐదో టాటూ వేయించుకుంది.

వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ తాజాగా ఐదో టాటూ వేయించుకుంది. ఇంతకుముందే తన మణికట్టు మీద ఉన్న చిన్న టాటూను కనిపించకుండా చేయడానికి అదే స్థానంలో పెద్ద గులాబీ పువ్వును ఆమె టాటూగా వేయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందే శ్రుతి తన వీపు భాగంలో తన పేరును మాతృభాష తమిళంలో టాటూగా వేయించుకుంది. అలాగే తన పాదాల మీద 'రైజ్' అనే పదాన్ని చెక్కించుకుంది. స్టైలు కోసం కొంతమంది, సెంటిమెంటుతో మరికొంతమంది ఇటీవలి కాలంలో టాటూలు వేయించుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్లలో ఈ సంస్కృతి బాగా పెరిగింది. అంతేకాదు, తాము వేయించుకున్న టాటూలను కూడా వాళ్లు బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు తప్ప ఎక్కడా సిగ్గుపడటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement