స్కూల్ డేస్ గుర్తొస్తాయి! | 'Darling' will outperform 'Prema Katha Chitram': G V Prakash | Sakshi
Sakshi News home page

స్కూల్ డేస్ గుర్తొస్తాయి!

May 1 2016 10:59 PM | Updated on Sep 3 2017 11:12 PM

స్కూల్ డేస్ గుర్తొస్తాయి!

స్కూల్ డేస్ గుర్తొస్తాయి!

సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ దృష్టంతా ఇప్పుడు యాక్టింగ్‌పై ఉంది.

సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ దృష్టంతా ఇప్పుడు యాక్టింగ్‌పై ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ప్రేమకథా చిత్రమ్’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’ ద్వారా జీవీ హీరోగా మారారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ ఉత్సాహంతో ‘త్రిష ఇల్లేనా నయనతార’లో హీరోగా నటించారు. ఇప్పుడు జీవీ నటించిన మూడో చిత్రం ‘పెన్సిల్’ ఈ నెల 13న విడుదల కానుంది. తెలుగమ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక.
 
 ఎం.పురుషోత్తం సమర్పణలో మణి నాగరాజ్ దర్శకత్వంలో జి.హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘పాఠశాల జీవితాన్ని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే చిత్రం ఇది. పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది’’ అని జీవీ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన నేను తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ఇది. జీవీ ప్రకాశ్‌గారు హీరోగా నటించడంతో పాటు మంచి పాటలిచ్చారు’’ అని నిర్మాత హరి చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement