ఈ వజ్రాల వాచీ రూ. 250 కోట్లు | this diamond watch cost rs 250 crore | Sakshi
Sakshi News home page

ఈ వజ్రాల వాచీ రూ. 250 కోట్లు

Mar 20 2015 4:23 PM | Updated on Sep 2 2017 11:09 PM

ఈ వజ్రాల వాచీ రూ. 250 కోట్లు

ఈ వజ్రాల వాచీ రూ. 250 కోట్లు

బేసెల్: కాంతులీనే శ్వేతవర్ణ వజ్రాలు పొదిగిన ఈ గడియారం విలువ తెలిస్తే నిజంగా కళ్లు తిరుగుతాయి. 152 క్యారెట్ల వజ్రాలతో రూపొందించిన దీని విలువ అక్షరాల 250 కోట్ల రూపాయలు.

బేసెల్: కాంతులీనే శ్వేతవర్ణ వజ్రాలు పొదిగిన ఈ గడియారం విలువ తెలిస్తే నిజంగా కళ్లు తిరుగుతాయి. 152 క్యారెట్ల వజ్రాలతో రూపొందించిన దీని విలువ అక్షరాల 250 కోట్ల రూపాయలు. లండన్‌కు చెందిన ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ‘గ్రాఫ్’ దీన్ని స్విట్జర్టాండ్‌లోని బేసెల్‌లో జరుగుతున్న ప్రపంచస్థాయి వజ్రాల నగల ప్రదర్శనలో అమ్మకానికి పెట్టింది. ‘ది ఫాసినేషన్’ పేరిట పిలుస్తున్న ఈ గడియారాన్ని చేతితోపాటు మెడకు నెక్లెస్ లాకెట్‌లా కూడా ధరించేలా తయారు చేశారు. దీని తయారీకి కొన్ని వేల గంటల సమయం పట్టిందని గ్రాఫ్ వజ్రాల కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ లారెన్స్ గ్రాఫ్ తెలిపారు. ‘వజ్రాలే ఆడవారికి అందమైన మిత్రుల’నే అలనాటి హాలివుడ్ అందాల తార మార్లిన్ మన్రో మాటలను నమ్మినవారు ధరకు వెరవకుండా ఈ గడియారాన్ని చేజిక్కించుకోవచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement