బిడ్డా.. అడ్రస్ లేకుండా పోతారు | Naini fires on Opposition | Sakshi
Sakshi News home page

బిడ్డా.. అడ్రస్ లేకుండా పోతారు

Aug 24 2016 2:53 AM | Updated on Oct 20 2018 5:03 PM

బిడ్డా.. అడ్రస్ లేకుండా పోతారు - Sakshi

బిడ్డా.. అడ్రస్ లేకుండా పోతారు

‘‘ప్రాజెక్టులు కడుతుంటే నిరసనలు తెలుపుతారా.. బిడ్డా.. మీరు అడ్రస్ లేకుండా పోతారు. ప్రజలే మీకు బుద్ధి చెబుతారు..’ అని విపక్షాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు.

- విపక్షాలపై మంత్రి నాయిని ఫైర్

సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రాజెక్టులు కడుతుంటే నిరసనలు తెలుపుతారా.. బిడ్డా.. మీరు అడ్రస్ లేకుండా పోతారు. ప్రజలే మీకు బుద్ధి చెబుతారు..’ అని విపక్షాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పరిణామమని చెప్పారు.

మహారాష్ట్రతో ఒప్పందం నేపథ్యంలో సచివాలయంలో తన అనుచరులతో కలసి నాయిని భారీ ఎత్తున బాణసంచా పేల్చి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్మాణాత్మకంగా అవరోధాలను అధిగమిస్తూ.. చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. దీనితో తెలంగాణలో భూములు సస్యశామలం అవుతాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement