సత్వర న్యాయం అందించాలి: జస్టిస్‌ రజని | justice rajani about Speedy justice | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయం అందించాలి: జస్టిస్‌ రజని

Jan 17 2017 3:54 AM | Updated on Sep 5 2017 1:21 AM

సత్వర న్యాయం అందించాలి: జస్టిస్‌ రజని

సత్వర న్యాయం అందించాలి: జస్టిస్‌ రజని

న్యాయస్థానాలపై నమ్మకంతో వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని జస్టిస్‌ టి.రజని పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: న్యాయస్థానాలపై నమ్మకంతో వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌ టి.రజని పేర్కొన్నారు. నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై వెళ్తున్న జస్టిస్‌ టి.రజనిని నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు.

న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయమూర్తుల సహకారంతో లోక్‌అదాలత్, జైలు అదాలత్, మీడియేషన్‌ ద్వారా వేలాది కేసులు పరిష్కరించి కక్షిదారులకు న్యాయం అందించామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు తిరుమల్‌రావు, సుధాకర్‌నాయుడు, సాయికల్యాణ్‌ చక్రవర్తి, తిరుపతి, రమాకాంత్, విల్సన్, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జితేందర్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, పూర్వ అధ్యక్షులు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement