గ్రేటర్ ఎన్నికల్లో బాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం
	చైతన్యపురి: గ్రేటర్ ఎన్నికల్లో బాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ఎల్‌బీనగర్‌లో జరిగే సభలో పాల్గొంటారని పార్టీ ఇంచార్జి సామరంగారెడ్డి తెలిపారు.
	
	కామినేని చౌరస్తా సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సాయంత్రం 7గంటలకు బహిరంగ సభ జరుగుతుందని నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజైరె  విజయవంతం చేయాలని ఆయన కోరారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
