మావోయిస్ట్ రామ్కిషోర్ సాహ్ని అరెస్ట్ | Maoist Ram Kishore Sahni was arrested | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్ రామ్కిషోర్ సాహ్ని అరెస్ట్

Apr 27 2014 3:23 PM | Updated on Oct 16 2018 8:23 PM

మావోయిస్టు రామ్‌కిశోర్ సాహ్నిని ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముజఫర్పూర్(బీహార్): మావోయిస్టు రామ్‌కిశోర్ సాహ్నిని ముజఫర్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సాహ్నిని తెంగ్రారి గ్రామంలో అరెస్ట్ చేసినట్లు ముజఫర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రంజిత్ కుమార్ మిశ్రా చెప్పారు. ముజఫర్‌పూర్ ఎన్నికల్లో విధ్యంసానికి మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. సాహ్ని నుంచి పోలీసులు 5 లక్షల 50 వేల రూపాయల  నగదు, పేలుడు సామాగ్రి, నక్సల్ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. సాహ్నిని విచారణ నిమిత్తం టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముజఫర్పూర్ లోక్సభ స్థానం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ మే 7న పోలింగ్ జరుగనుంది.

పోలీసుల అదుపులో మావోయిస్ట్ దేవా
ఖమ్మం: చర్ల మండలం కిష్టారం అటవీప్రాంతంలో మావోయిస్ట్ దేవాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement