
శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శు.నవమి రా.10.51 వరకు తదుపరి దశమి, నక్షత్రం రేవతి ఉ.8.24 వరకు తదుపరి అశ్వని, వర్జ్యం... లేదు.
దుర్ముహూర్తం ఉ.6.37 నుంచి 8.04 వరకు అమృతఘడియలు... ఉ.5.05 నుంచి 7.28 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.35
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృషభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఉద్యోగ యత్నాలు అనుకూలం. సంఘంలో గౌరవం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. సన్మానయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
కన్య: కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి.
తుల: కొత్త పనులు చేపడతారు. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
వృశ్చికం: పనులు సజావుగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. ఆధ్యాత్మిక చింతన.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు.
మకరం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. ఇంటాబయటా చికాకులు.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
మీనం: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు