రాష్ర్ట విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో బుధవారం నుంచి మొదలు పెట్టిన నిరవధిక నిరాహార దీక్షను సుజయ్‌కృష్ణ రంగారావు, డబ్ల్యూవీఎల్‌ఎన్ రాయులు గురువారం రాత్రి పది గంటలకు దీక్ష విరమించారు.
బొబ్బిలి, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో బుధవారం నుంచి మొదలు పెట్టిన నిరవధిక నిరాహార దీక్షను సుజయ్‌కృష్ణ రంగారావు, డబ్ల్యూవీఎల్‌ఎన్ రాయులు గురువారం రాత్రి పది గంటలకు దీక్ష విరమించారు. పార్టీ అరుకు పార్లమెంట్ పరిశీలకుడు ఆర్వీ ఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) నిమ్మరసం ఇచ్చి వారితో దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా బేబీనాయన మాట్లాడుతూ విభజనకు నిరసనగా పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్‌ను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 51 రోజులుగా బొబ్బిలిలో నిర్వహిస్తున్న పార్టీ రిలే దీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో నిర్వహించే ఉద్యమం వల్ల తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు ముగింపు పడేలా ఉంటుందన్నారు. కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయాలను కూడా దీనిలో ఎండగడతామన్నారు.