విభజన వద్దు | we are against to state bifurcation | Sakshi
Sakshi News home page

విభజన వద్దు

Sep 4 2013 5:31 AM | Updated on Sep 1 2017 10:26 PM

సమైక్యాంధ్ర కోసం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్) ఉద్యోగులు, సిబ్బంది నిర్వహించిన ఆందోళనలతో మంగళవారం కశింకోట హో రెత్తిపోయింది. ర్యాలీ, రాస్తారోకో, మా నవహారం, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ పరిధిలోని ఐదు మం డలాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.

 కశింకోట, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్) ఉద్యోగులు, సిబ్బంది నిర్వహించిన ఆందోళనలతో మంగళవారం కశింకోట హో రెత్తిపోయింది. ర్యాలీ, రాస్తారోకో, మా నవహారం, వంటా-వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ పరిధిలోని ఐదు మం డలాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.
 
  అనంతరం మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. రాష్ట్ర విభజన వద్దంటూ నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, సంస్థ ఉపాధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, డెరైక్టర్లు దొడ్డి బాలాజీ, సబ్బవరపు నారాయణమూ ర్తి తదితరులు వీరికి సంఘీభావం తెలి పా రు. రోడ్లపైనే ఉద్యోగులు, సిబ్బందితో సహా వారు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ శేషుకుమార్, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు జి. పెంటారావు, కోశాధికారి దొడ్డి ఈశ్వరరావు, సంస్థ సీనియర్ పరిపాలనాధికారి అప్పారావు, పీఈ జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement